School holiday tomorrow: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు పాఠశాలలకు సెలవు
రామాయణాన్ని రచించినది వాల్మీకి మహర్షి. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి శ్రీ వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. దిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు అనేక రాష్ట్రాల్లో అక్టోబర్ 26 న పాఠశాలలు, కాలేజీలు మూతపడనున్నాయి. దేశ రాజధాని దిల్లీలో అన్ని పాఠశాలలు, ఎడ్యూకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ దిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అక్టోబర్ 26 వాల్మీకి జయంతి సందర్భంగా దిల్లీ సీఎం రేఖా గుప్తా పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు సెక్రటేరియట్ లో ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేయనున్నారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ కింద ఈ కార్యక్రమం జరగనుంది.
అలాగే ఉత్తర్ ప్రదేశ్ లోని అన్ని విద్యాసంస్థలకు అక్టోబర్ 26 న సెలవు ప్రకటించింది యోగీ ప్రభుత్వం. రాష్ట్రంలోని కల్చర్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో రామాయణ భక్తి గీతాల ఆలాపన, భజనలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వాల్మీకి జయంతి కార్యక్రమాల కోసం ప్రతి జిల్లాకు రూ. లక్ష రూపాయలను కేటాయించింది యోగి సర్కార్. ఈ మేరకు డివిజనల్ కమిషనర్స్.. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ కు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే రాష్ట్రంలోని శ్రీరామ ఆలయాలు, హనుమాన్ టెంపుల్స్ తోపాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో రామాయణ గీతాలను ఆలపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చిత్రకూట్ లోని వాల్మీకి తపోస్థలం ప్రాంతంలో ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహించనుంది.

అక్టోబర్ 26 వాల్మీకి జయంతి సందర్భంగా దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ తో పాటు హరియాణా, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మణిపూర్, పంజాబ్, త్రిపుర తదితర రాష్ట్రాల్లోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాయి అక్కడి ప్రభుత్వాలు. మరోవైపు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 26న విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించారు అధికారులు. గిరిజన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన కుమ్రం భీమ్ వర్థంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు కళాశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications
