అచ్చం లాక్ డౌన్ మాదిరిగానే.. బీహర్‌లో అమలు.. నైట్ కర్ఫ్యూ..
కరోనా ఉగ్రరూపం దాల్చింది. నియంత్రణ చర్యలపై ప్రభుత్వాలు ఫోకస్ చేశాయి. ఒకడుగు ముందేసిన బీహర్ లాక్ డౌన్ మాదిరిగా ఆంక్షలు విధించింది. కరోనా కేసులు.. కరోనా మరణాలు పెరగడంతో ఈ మేరకు నితీశ్ కుమార్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అవేంటో చుద్దాం. పదండి.

34 మంది మృత్యువాత
బీహర్‌లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. నిన్న 34 మంది వైరస్ సోకి చనిపోయారు. 7870 కరోనా కేసులు రావడంతో సీఎం నితీశ్ కుమార్ వెంటనే మరింత ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నారు. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తోందనే కఠోర సత్యం తెలిసింది. దీంతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి లాక్ డౌన్ మాదిరిగా కఠిన నిబంధలను అమలు చేయబోతున్నారు.

కర్ఫ్యూ..
రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దు. మే వరకు అన్నీ విద్యాసంస్థలను మూసివేస్తారు. థియేటర్లు, షాపింగ్ మాల్స్, క్లబ్బులు, పార్కులు కూడా క్లోజ్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు సాయంత్రం 5 గంటల వరకు క్లోజ్ చేయాలి. కష్టకాలంలో విధులు నిర్వహిస్తున్న హెల్త్ కేర్ వర్కర్లకు ఒక నెల జీతం బోనస్ అందజేస్తారు. కరోనా కేసులు ఎక్కువ ఉన్న చోట కంటోన్మైంట్ జోన్లను ఏర్పాటు చేస్తారు.

మళ్లీ క్వారంటైన్ కేంద్రాలు..
క్వారంటైన్ కేంద్రాలను కూడా అన్నీ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తారు. ముఖ్య పట్టణాల్లో కూడా కంపల్సరీగా నెలకొల్పుతారు. కరోనా సోకిన వారిని నేరుగా అక్కడికే పంపిస్తారు. మాంసం, మెడికల షాపులు, నిత్యావసర వస్తువులు సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటాయి. రెస్టారెంట్లలో డెలివరీకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అక్కడ భోజనం చేసే వెసులుబాటు లేదు.

మందిరాలు కూడా క్లోజ్
దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు కూడా క్లోజ్ చేస్తారు. పెళ్లిళ్లు, కర్మలు కూడా నిషేధం అమల్లో ఉంటుంది. కానీ 100 మంది వరకు పరిమిత సంఖ్యలో చేసుకునే అవకాశం ఉంది. జనసమ్మర్థం గల ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఫైర్ సర్వీస్, ఈ కామర్స్ వాహనాలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది.












Click it and Unblock the Notifications