ఛీ..ఛీ.. వీడేం టీచర్.. స్కూల్ ట్రిప్ లో 8 మంది పదో తరగతి విద్యార్థినులపై..!

ఇటీవలి కాలంలో సమాజంలో రోజురోజుకూ మహిళలు, విద్యార్థులు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా మరిచి కొన్ని మానవ మృగాలు బరితెగిస్తున్నాయి. ఆడపిల్ల అయితే చాలు అని మృగాళ్లలా మీదపడిపోతున్నాయి. వావి వరసలు మరచి అత్యాచారాలకు పాల్పడుతున్న వారు మరోవైపు ఉన్నారు. తమ కామ వాంఛ తీరడం కోసం ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కఠినంగా శిక్షించినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కేరళలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. పదోతరగతి చదువుతున్న విద్యార్థినులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కేరళ లోని కోజికోడ్ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. కోజికోజ్ జిల్లా ఎలత్తూర్ లోని అంబాలప్పాడిలో ఉన్న పీవీఎస్ హై స్కూల్ కు చెందిన దాదాపు 160 మంది విద్యార్థులు సెప్టెంబర్ 24 న కొడైకెనాల్ టూర్ కు వెళ్లారు. గర్ల్స్ , బాయ్స్ సెపరేట్ బస్సుల్లో ట్రిప్ కు వెళ్లారు. అయితే ఇదే స్కూల్ లో ఉర్దూ టీచర్ గా పనిచేసే సలిత్(42) గర్ల్స్ బస్సులో ట్రిప్ కు వెళ్లాడు. అయితే ఈ ట్రిప్ లో భాగంగా పదోతరగతి చదివుతున్న 8 మంది విద్యార్థినులతో టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడు. సెప్టెంబర్ 27 న స్కూల్ ట్రిప్ ముగిసిన వెంటనే విద్యార్థినులు జరిగిన విషయాన్ని స్కూల్ హెడ్ మాస్టర్ కు తెలిపారు. వెంటనే ఆయన ఎలత్తూర్ పోలీసులకు సమాచారం అందించారు.

schoolteacher Kerala has sexually assaulted 8 female students during school trip Kozhikode teacher

ఇక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విద్యార్థినుల నుంచి స్టేట్ మెంట్స్ ను రికార్డు చేశారు. తొలుత ఈ ఘటనపై ఏడుగురు బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మరుసటి రోజు మరో బాలిక ఇదే ఘటనపై ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు 8 సెపరేట్ కేసులుగా నమోదు చేసుకున్నారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న టీచర్ సలిత్ ప్రస్తుతం పరారీ అయ్యాడు. కొద్దిరోజులు వయనాడ్ జిల్లాలో ఉండి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను అటు సెషన్స్ కోర్టుతో పాటు కేరళ హైకోర్టు కూడా తిరస్కరించడంతో ఎలత్తూర్ పోలీసుల ముందు నవంబర్ 3 మంగళవారం రోజున ఆయన సరెండర్ అయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+