ఇస్రో కౌంట్‌డౌన్ స్వరం మూగబోయింది: వలర్మతి కన్నుమూత, చంద్రయాన్-3నే చివరిది
శ్రీహరికోట: భారత అంతరిక్షపరిశోధన సంస్థ(ISRO) కౌంట్‌డౌన్ స్వరం మూగబోయింది. ఇస్రోలో రాకెట్ ప్రయోగాల వేళ కౌంట్‌డౌన్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. గంభీరమైన తన స్వరంతో కౌంట్‌డౌన్ విధులు నిర్వహించే ఉద్యోగిని వాలర్మతి(Valarmathi) గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో శనివారం రాత్రి కన్నుమూశారు.
చంద్రయాన్-3 సహా ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో వాలర్మతి(50) బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, జులై 14న ప్రయోగించిన అత్యంత విజయవంతమైన చంద్రయాన్-3 ఆమె చివరి కౌంట్‌డౌన్‌గా మారింది.

ఆమె మృతికి సంతాపం తెలిపారు ఇస్రో మాజీ డైరెక్టర్ డాక్టర్ పీవీ వెంకటకృష్ణన్. "శ్రీహరికోట నుంచి ఇస్రో భవిష్యత్తు మిషన్ల కౌంట్‌డౌన్‌లకు వలర్మతి మేడమ్ వాయిస్ ఉండదు. చంద్రయాన్-3 ఆమె చివరి కౌంట్‌డౌన్ ప్రకటన. ఊహించని మరణం. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రాణములు!' అని ఆయన సంతాపం వ్యక్తం చేవారు.
వాలర్మతి మృతితో దివంగత శాస్త్రవేత్తకు సోషల్ మీడియాలో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, పలువురు నివాళులు అర్పిస్తున్నారు. 1959లో తమిళనాడులోని అరియలూర్‌లో జన్మించిన వలర్మతి 1984లో ఇస్రోలో సైంటిస్ట్‌గా చేరారు.
The voice of Valarmathi Madam will not be there for the countdowns of future missions of ISRO from Sriharikotta. Chandrayan 3 was her final countdown announcement. An unexpected demise . Feel so sad.Pranams! pic.twitter.com/T9cMQkLU6J
— Dr. P V Venkitakrishnan (@DrPVVenkitakri1) September 3, 2023
ఇస్రోలో ప్రయోగించిన రాకెట్ ప్రయోగాల లాంచింగ్ కౌంట్‌డౌన్ ఆమే చెప్పేవారు. ఇలా ఆమె విలక్షణమైన కంఠం దేశ ప్రజలకు సుపరిచితంగా మారింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ఆమె మొదటిసారిగా 2015లో అందుకున్నారు. ఇస్రో నుంచి రిటైరైన ఆమె శనివారం సాయంత్రం గుండెపోటుకు గురై చెన్నైలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications