కాచిగూడ, తిరుపతి మీదుగా వీక్లీ ఎక్స్ ప్రెస్.. హాల్ట్ స్టేషన్లు: అరుణాచలం కవర్

Special Trains: పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే లక్షలాదిమంది అయ్యప్ప స్వామి భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొత్తగా వీక్లీ ఎక్స్ ప్రెస్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ నెల 20 నుంచి మకర జ్యోతి వరకు అంటే జనవరి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైలు రాకపోకలు సాగిస్తుంది. అయ్యప్ప స్వామి భక్తులకు అందుబాటులో ఉంటుంది.

SCR introduces Hazur Sahib Nanded to Kollam Weekly Special Express

మహారాష్ట్రలోని హుజూర్ సాహెబ్ నాందెడ్ నుంచి కొల్లం వరకు ఈ రైలు రాకపోకలు సాగించే రైలు ఇది. ఈ నెల 20వ తేదీన పట్టాలెక్కనుంది.

ఈ నెల 20 నుంచి జనవరి 15వ తేదీ వరకు ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు నాందెడ్ నుంచి బయలుదేరే నంబర్ 07111 వీక్లీ ఎక్స్ ప్రెస్ రెండో రోజు అంటే శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కొల్లం చేరుకుంటుంది.

ఈ నెల 22 నుంచి జనవరి 17వ తేదీ వరకు ప్రతి శనివారం తెల్లవారు జామున 5:40 నిమిషాలకు కొల్లం నుంచి బయలుదేరే నంబర్ 07112 వీక్లీ ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు రాత్రి 9:30 గంటలకు నాందెడ్ చేరుకుంటుంది.

ముద్ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, బొల్లారం, కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, విరుధాచలం, తిరుచిరాపల్లి, దిండిగల్, మధురై, విరుధ్ నగర్, శివకాశి, శ్రీవిల్లి పుత్తూరు, రాజపాల్యం, శంకరన్ కోయిల్, కడయనల్లూర్, తెన్ కాశి, సెంగొట్టై, పూనలూర్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+