ఆర్తనాదాలు, రక్తపు మరకలు, వణికిపోయిన చిన్నారులు, రన్ వేపై భీతావాహ దృశ్యాలు..
కోజికోడ్ విమాన ప్రమాదంతో రన్ వేపై భీతవాహ వాతావరణం నెలకొంది. ఎయిర్ ఇండియా విమానం రెండు ముక్కలు కావడంతో పైలట్, కో పైలట్ సహా 19 మంది చనిపోయారు. 45 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే ప్రమాదం జరిగిన రన్ వే ఆరుపుల ఆర్తనాదాలతో మిన్నంటింది. ఎటుచూసిన రక్తపు మరకలు కనిపించాయి. ఆ సమయంలో చిన్నారులు భయపడి బోరున ఏడ్చేశారు. అంబులెన్స్‌ల రాకతో ఆ ప్రాంగణం సైరన్ల మోత వినిపించింది.
విమాన ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో ఉన్న ప్రయాణికుల అరిచారు. విమానంలో కొందరు నాలుగు, ఐదేళ్ల చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే వారు సీట్ల కింద ఇరుక్కుపోయారని.. వారిని తీయడానికి కష్టమైందని వివరించారు. వారిని ఆస్పత్రికి తరలించేందుకు సమీపంలో గల ప్రజలు కూడా ముందుకొచ్చారు. తమ కార్లలో కోజికోడ్, మలప్పురంలో గల వివిధ ఆస్పత్రులకు తరలించారు. విమానం ల్యాండయిన సమయంలో పెద్ద శబ్దం విన్నానని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

రన్ వే పైకి వెళ్లేసరికి కొందరు పరిస్థితి విషమంగా ఉంది అని, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. కొందరికీ కాళ్లు విరిగిపోయాయని.. మరికొందరికీ చేతులు, ఇతర చోట్ల గాయపడ్డారని తెలిపారు. వారిని కాపాడే సమయంలో తన చేతులు, షర్ట్ రక్తం నిండిపోయిందని తెలిపారు. విమానం నుంచి కాక్ పిట్ తీసిన తర్వాత.. పైలట్‌ను బయటకు తీశారని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.
Recommended Video
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications