సముద్రంలోపలా మహిళలకు తప్పని లైంగిక వేధింపులు
మంగళూరు: పాఠశాల, కళాశాల, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఎక్కడా అని తేడా లేకుండా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. కాగా, స్కూబా డైవింగ్ నేర్చుకునేందుకు వచ్చిన మహిళలపై శిక్షకుడిగా ఉన్న ఓ వ్యక్తి సముద్రం లోపల వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కర్ణాటకలోని మంగళూరు సముద్ర తీరంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్కూబా డైవింగ్ శిక్షకుడిగా పని చేస్తున్న ధీరేంద్ర రావత్ ముగ్గురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గతంలో రెండు సార్లు జైలుకు కూడా వెళ్లాడు. దీంతో అధికారులు అతడ్ని శిక్షకుడిగా విధులు నిర్వహించకూడదని ఆదేశించారు. అయినా అతడు వాటిని పట్టించుకోకుండా శిక్షకుడిగా సముద్ర తీరంలో శిక్షకుడిగా పని చేస్తున్నాడు.
కాగా, జనవరి 26న సముద్ర తీరంలో శిక్షకుడిగా ఉన్న ధీరేంత్ర రావత్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆరోపించింది. ‘ అతని(రావత్) వద్దకు స్కూబా డైవింగ్ నేర్చుకునేందుకు వచ్చిన నేను అతనితోపాటు సముద్రంలోకి వెళ్లాను. అతడు నా ఆక్సిజన్ ట్యాంకును తన వద్ద ఉంచుకున్నాడు. అతనితోపాటు నన్ను తిప్పుకున్నాడు. ఆ తర్వాత నా శరీర భాగాలను తాకడం ప్రారంభించాడు. నేను అతని నుంచి దూరంగా వెళదామంటే ఆక్సిజన్ అందకపోవడంతో ఆ పని చేయలేకపోయాను' అని ఆమె పేర్కొంది.

ఆ తర్వాత బాధిత టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత ఫిబ్రవరిలో నిందితుడు రావత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిలు పొందిన అతను మరుసటి రోజు బయటికి వచ్చాయి.
అంతేగాక, గత నవంబర్‌లో రావత్ ఓ మహిళను సముద్రంలోకి తీసుకెళ్లిన రావత్.. ఆమెపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె బయటికి వచ్చిన తర్వాత తన స్నేహితులతో కన్నీటిపర్యాంతమవుతూ జరిగిన ఘటనను తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా, మరోసారి నిందితుడు రావత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత బెయిలుపై బయటికి వచ్చిన రావత్.. గత డిసెంబర్‌లో తన వద్దకు స్కూబా డైవింగ్ నేర్చుకునేందుకు వచ్చిన పంజాబ్‌కు చెందిన మహిళా వైద్యురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదుతో జనవరిలో అరెస్ట్ అయ్యాడు. 15 రోజులపాటు జైలు జీవితం గడిపాడు. ఈ నేపథ్యంలో స్కూబా డైవింగ్ శిక్షకుడిగా నియమించుకున్న సంస్థ అతడ్ని తొలగించింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications