Stock Market:ఇన్వెస్టర్లకు హెచ్చరిక.. భారీగా నష్టపోతున్న పెట్టుబడిదారులు..
ఈ మధ్య స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టే వారు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా యూత్ స్టాక్ మార్కెట్ పైవు మొగ్గు చూపుతున్నారు. అందులోనూ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వారు ఎక్కువగా ఉన్నారు. అయితే చాలా మంది నష్టపోతున్నారు. అయితే మార్కెట్ గణాంకాలు ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి. చాలా మంది పెట్టుబడిదారులు, ముఖ్యంగా చిన్న పెట్టుబడిదారులు, డెరివేటివ్స్ విభాగంలో కాకుండా నగదు విభాగంలో డబ్బును పెట్టుబడి పెట్టినప్పటికీ, స్టాక్ మార్కెట్‌లో నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
మార్చి 2023తో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో నగదు విభాగంలో ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసిన ప్రతి 10 మంది పెట్టుబడిదారులలో 7 మంది నష్టాలను చవిచూశారని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. అంటే నగదు విభాగంలో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్న 70 శాతం ఇన్వెస్టర్లు నష్టపోయారు. ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసే చాలా మంది ఇన్వెస్టర్లు మార్కెట్‌లో డబ్బును కోల్పోతున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది.

మార్కెట్‌లో ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతుండటంతో, ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసే వ్యక్తిగత ఇన్వెస్టర్ల సంఖ్య కూడా పెరుగుతోందని సెబీ నివేదిక తెలియజేస్తోంది. ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్‌లో ఇంట్రాడే ట్రేడ్ చేస్తున్న పెట్టుబడిదారుల సంఖ్య 300 శాతానికి పైగా పెరిగింది. అంటే 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు 4 రెట్లు పెరిగింది. నగదు విభాగంలో ప్రతి ముగ్గురు పెట్టుబడిదారులలో ఒకరు ఇంట్రాడే ట్రేడ్‌లో పాల్గొన్నారు.
ఫ్యూచర్స్, ఆప్షన్లలో ట్రేడింగ్ చేసే వారి గురించి సెబీ కొంతకాలం క్రితం ఒక నివేదికను విడుదల చేసింది. అందులో మార్కెట్‌లోని డెరివేటివ్స్ విభాగంలో అంటే ఫ్యూచర్స్, ఆప్షన్లలో ట్రేడింగ్ చేస్తున్న రిటైల్ ఇన్వెస్టర్లలో 90 శాతానికి పైగా నష్టాలను చవిచూడాల్సి వస్తుందని మార్కెట్ రెగ్యులేటర్ పేర్కొంది. ఫ్యూచర్స్, ఆప్షన్‌లకు దూరంగా ఉండాలని సెబీ నిరంతరం ఇన్వెస్టర్లకు సలహా ఇస్తోంది. ఇంట్రాడే విభాగంలో నష్టపోయిన పెట్టుబడిదారులలో 76 శాతం మంది 30 ఏళ్ల లోపువారేనని నివేదిక పేర్కొంది.












Click it and Unblock the Notifications