బీజేపీ షాక్, మంత్రి డీకే ఇంటిలో రెండో రోజు ఐటీ సోదాలు, లాకర్ల పాస్ వర్డ్ తెలీదు. అంతేనా?
బెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ ఇంటిలో రెండో రోజూ (గురువారం) ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. బుధవారం అర్దరాత్రి వరకు మంత్రి డీకే శివకుమార్ ఇంటిలో సోదాలు చేసిన అధికారులు రాత్రి అక్కడే మకాం వేశారు.
గురువారం వేకువ జామున మళ్లీ సోదాలు మొదలు పెట్టారు. రాత్రి ఇంటి నుంచి బయటకు వెళితే మొత్తం తారుమారు అయ్యే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ఐటీ శాఖ అధికారులు అక్కడే ఉన్నారని తెలిసింది. రాత్రి హోటల్ నుంచి బోజనం తెప్పించుకుని అక్కడే ఆరగించారు.

మంత్రి డీకే. శివకుమార్ ఇంటిలో మొత్తం ఐదు లాకర్లు ఉన్నాయని, వాటిలో ఇంకా మూడు లాకర్లు తెరవలేదని సమాచారం. ఐదు లాకర్లపైకి రెండు లాకర్ల పాస్ వార్డ్ మాత్రమే డీకే. శివకుమార్ చెప్పారని, మరో మూడు లాకర్ల పాస్ వర్డ్ చెప్పలేదని తెలిసింది.
బెంగళూరు నగరంలోని చామరాజపేటలో డీకే శివకుమార్ కు బ్యాంకు అకౌంట్ ఉంది. ఆ బ్యాంక్ అకౌంట్ పూర్తి వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులు సేకరించారని సమాచారం. మూడు లాకర్ల పాస్ వర్డ్ చెప్పకపోవడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు నానా తంటాలు పడుతున్నారని కన్నడ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి.
డీకే. శివకుమార్ ఇంటిలో పూర్తి సమాచారం చేసకరించాలంటే ఎంత సమయం పడుతుందో తెలీదని ఓ అధికారి అంటున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications