Parliament Session: కేంద్రం తేల్చేస్తుందా - సిద్దమైన ప్రతిపక్షాలు..!!
నేటి నుంచి పార్లమెంట్ మలివిడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే అంశాలతో ప్రతిపక్షాలు సిద్దం అవుతున్నాయి.
నేటి నుంచి పార్లమెంట్ మలివిడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే అంశాలతో ప్రతిపక్షాలు సిద్దం అవుతున్నాయి. 16 ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో సమావేశం అయ్యారు. అదానీ-హిండెన్‌బర్గ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టాలన్న డిమాండ్ చేయాలని నిర్ణయించాయి. ఢిల్లీ మద్యం పాలసీ అవకతవకల కేసు, లాండ్ ఫర్ జాబ్స్ కేసుల గురించి పార్లమెంట్ లో చర్చిస్తామని ప్రకటించాయి. అటు లండన్ లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపైన అధికార బీజేపీ గుర్రుగా ఉంది. ఈ సమావేశాలు ఏప్రిల్ 6 వరకూ కొనసాగుతాయి.

అధికార పక్షం పై దాడికి సిద్దం
పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే విపక్షాల పైన విచారణ సంస్థల దాడుల పైన ప్రధానికి 9 పార్టీల నేతలు లేఖ రాసాయి. ప్రజాస్వామ్యం నిరంశుత్వంగా మారుస్తున్నార ని తీవ్ర వ్యాఖ్యలు చేసాయి. తిరిగి ఈ సమావేశాల్లోనూ అదానీ-హిండెన్‌బర్గ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టాలన్న డిమాండ్ ప్రతిపక్షాల నుంచి కొనసాగనుంది. సమావేశాల్లో కీలక బిల్లులను ప్రతిపాదించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసాయి. ఇప్పటి వరకు ఉభయ సభల్లో 35 బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు వెల్లడాంచాయి.
కామన్ అజెండాతో సిద్దమైన ప్రతిపక్షాలు
రాజ్యసభ ఛైర్మన్ విపక్ష నేతలతో సమావేశం అయ్యారు. సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. అందుకు అన్ని పార్టీలు ఏకీభవించాయి. తొలి విడత సమావేశాల్లో అదానీ-హిండెన్‌బర్గ్‌పై ప్రతిపక్షాలు సభను అడ్డుకున్నాయి. ప్రధాని ఉభయ సభల్లోనూ చేసిన ప్రసంగాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించ లేదు. తమ హయాంలో తీసుకున్న నిర్ణయాలను..వాటి ఫలితాలను వివరించారు. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసారు. ఇక, ఇప్పుడు 16 ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పైన ఐక్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఈ కూటమికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నాయకత్వం వహిస్తున్నారు. ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష పార్టీల నేతల పైన ఈడీ-సీబీఐ దాడుల గురించి నిలదీయాలని నిర్ణయించారు.

రాహుల్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రిటన్ లో చేసిన వ్యాఖ్యల పైన బీజేపీ మండిపడుతోంది. దేశ గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించారని ఆరోపిస్తోంది. రాహుల్ చేసిన వ్యాఖ్యల పైన సభలోనే నిలదీసేందుకు బీజేపీ నేతలు సిద్దం అవుతున్నారు. అదే సమయంలో చైనా తీరు పైన ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్ష సభ్యులు సిద్దమయ్యారు. అధిక ధరలు, నిరుద్యోగం పైన నిలదీస్తామని చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి వరుసగా జరుగుతున్న అరెస్టులు.. విచారణ సంస్థల తీరు పైన ప్రశ్నించాలని విపక్షాలు నిర్ణయించాయి. దీంతో, ఈ సమావేశాలు వాడి వేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications