సహజీవనం చేసిన మహిళకు భార్య హక్కులే: హైకోర్టు
చెన్నై: మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చట్ట ప్రకారం పెళ్లిచేసుకోకపోయినా, సహజీవనం చేసిన మహిళకి ఫించను తీసుకునే హక్కు ఉంటుందని మంగళవారం తీర్పు వెలువరించింది.
కోయంబత్తూర్ జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ స్టాన్లీ రెండో భార్య సుశీల కేసులో మద్రాసు హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న స్టాన్లీకి 1973, జూన్ 6న సుంగతి అనే మహిళతో వివాహమైంది.
రెండు సంవత్సరాలు జీవనం కలిసి జీవించారు. వీరికి ఒక పాప పేరు రూత్ ఎప్సియా. ఆ తర్వాత మనస్పర్థల వల్ల వీరిద్దరూ విడిపోయారు. మొదటి భార్యతో విడిపోయిన స్టాన్లీ, ఆమెకు విడాకులివ్వకుండానే సుశీల అనే మహిళను జూన్ 23, 1976లో వివాహం చేసుకున్నాడు

వీరికి ఒక బాబు పేరు నకీరన్, వయస్సు 35 ఏళ్లు. సుగంతి తన భర్త నుంచి విడాకులు కోరుతూ నవంబర్ 2003లో ఈరోడ్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత 2005లో సుగంతి మృతిచెందింది. 2001లో పదవీ విరమణ పొందాడు స్టాన్లీ.
అక్టోబర్ 2011లో మరణించిన స్టాన్లీ 2007వ సంవత్సరంలో తన మరణానంతరం తన ఫించను పొందేందుకు అర్హురాలిగా తన రెండో భార్య సుశీలను పేరుని కొయంబత్తూర్ ఎస్పీ వద్ద నమోదు చేయించాడు.
ఈ నేపథ్యంలో తనకు ఫ్యామిలీ ఫించను ఇప్పించవలసిందిగా సుశీల ఎకౌంటెంట్ జనరల్‌కు అప్పీలు చేసింది. అయితే ‘నీవు చట్ట ప్రకారం స్టాన్లీ భార్యవు కాదం'టూ ఆమె ప్రతిపాదనను తిరస్కరించారు. అనంతరం ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications