Second wife: పూజారిని వెంటాడి నరికి చంపేసి ?, లిక్కర్ షాప్ ముందు కలకలం, భార్య చెల్లితో !

చెన్నై/మదురై: గుడిలో పూజారిగా పని చేస్తున్న వ్యక్తి వివాహం చేసుకుని భార్యతో చక్కగా కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. ప్రతిరోజు గుడికి వస్తున్న భక్తులకు మంచి జరగాలని ఆ పూజరి పూజలు చేస్తున్నాడు. గుడి బయట ఎవరైనా పూజలు చెయ్యాలంటే వెళ్లి వారు కోరుకున్న పూజలు చేస్తున్నాడు. భార్య చనిపోవడంతో పూజారి రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో కాపురం చేస్తున్న పూజారి మీద కొందరు కక్ష పెంచుకున్నారు. బైక్ లో వెలుతున్న పూజారిని లిక్కర్ షాపు ముందు అడ్డుకున్న ప్రత్యర్థులు అతని మీద కత్తులతో దాడి చేశారు. బైక్ వదిలేసి ప్రాణాలు కాపాడుకోవాలని పారిపోతున్న పూజారిని వెంటాడి వెంటాడి నరికి చంపడం కలకలం రేపింది.

 పూజారి హ్యాపీలైఫ్

పూజారి హ్యాపీలైఫ్

తమిళనాడులోని మదురై జిల్లాలోని తిరుమంగళం సమీపంలోని సింధుపట్టి ప్రాంతంలో ముత్యాలు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గుడిలో పూజారిగా పని చేస్తున్న ముత్యాలు కొన్ని సంవత్సరాల క్రితం బాలసరస్వతి అనే మహిళను వివాహం చేసుకుని భార్యతో చక్కగా కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు.

 గుడిలో బయట పూజలు చేస్తున్న పూజారి

గుడిలో బయట పూజలు చేస్తున్న పూజారి

ప్రతిరోజు గుడికి వస్తున్న భక్తులకు మంచి జరగాలని పూజరి ముత్యాలు ప్రత్యేక పూజలు చేస్తున్నాడు. గుడి బయట ఎవరైనా పూజలు చెయ్యాలంటే వెలుతున్న ముత్యాలు వారు కోరుకున్న పూజలు చేస్తున్నాడు. భార్య బాలసరస్వతితో చక్కగా కాపురం చేసుకుంటూ పిల్లలతో కలిసి ముత్యాలు సంతోషంగా జీవించేవాడు.

 పూజారి రెండో పెళ్లి

పూజారి రెండో పెళ్లి

కొంత కాలం క్రితం ముత్యాలు భార్య బాలసరస్వతి అనారోగ్యంతో చనిపోయింది. తరువాత పూజారి ముత్యాలు అతని భార్య బాలసరస్వతి చెల్లెలు ఉమా మహేశ్వరిని రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ఉమా మహేశ్వరితో కాపురం చేస్తున్న పూజారి మొదటి భార్య పిల్లలతో కలిసి సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు.

 వైన్స్ షాప్ పక్కన పూజారి

వైన్స్ షాప్ పక్కన పూజారి

శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో గుడి తలుపులు మూసేసిన పూజారి ముత్యాలు పన్నీర్కుండు గ్రామం సమీపంలోని తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న టస్మాక్ లిక్కర్ షాప్ దగ్గరకు బైక్ లో వెళ్లాడు. అదే సమయంలో బైక్ లో వస్తున్న పూజారి ముత్యాలు మీద కక్ష పెంచుకున్న కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.

 పూజారిని వెంటాడి నరికి చంపేశారు

పూజారిని వెంటాడి నరికి చంపేశారు

ఒక్కసారిగా కత్తులతో దాడి చెయ్యడంతో పూజారి ముత్యాలు హడలిపోయి అతని బైక్ అక్కడే వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగు తీశాడు. పారిపోతున్న పూజారి ముత్యాలను వెంటాడిన ప్రత్యర్థులు అతన్ని గ్రామం సమీపంలోని బ్యారేజ్ దగ్గర పట్టుకుని వేటకోడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు.

Recommended Video

    Revant Reddy has strongly criticized Ktr for illegally entering funds into Mrs. Shailima's account
     లిక్కర్ షాపు దగ్గర పూజారికి ఏం పని ?

    లిక్కర్ షాపు దగ్గర పూజారికి ఏం పని ?

    పూజారి ముత్యాలు దారుణ హత్యకు గురి కావడంతో తిరుమంగళం ప్రజలు హడలిపోయారు. రాత్రి గుడి తలుపులు మూసేసిన పూజారి ముత్యాలు లిక్కర్ షాప్ దగ్గరకు ఎందుకు వెళ్లాడు ?, ముత్యాలును దారుణంగా నరికి చంపాల్సిన అవసరం ఏముంది ?, పూజారికి ఎవరితోనైనా అక్రమ సంబంధం ఉందా ?, అతని భార్య కోసం ఎవరైనా హత్య చేశారా ? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. పూజారిని అతికిరాతకంగా హత్య చెయ్యడం మదురై జిల్లాలో కలకలం రేపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+