Secret: పగలు హోటల్ లో క్లీనింగ్, రాత్రి ఇళ్లల్లో దూరి టోటల్ క్లినింగ్, ఏం చేస్తున్నాడంటే ? !
బెంగళూరు/ మంగళూరు: చదువు అంతంతమాత్రం చదువుకోవడంతో సొంతఊర్లో పని చెయ్యడానికి ఆ యువకుడికి అవకాశం తక్కువగా ఉండేది. పొట్టకూటి కోసం ఐటీ హబ్ కు చేరుకున్న అతను హోటల్ లో పనికి చేరాడు. పగలు హోటల్ లో క్లీనింగ్ చేస్తున్న అతను రాత్రి పూట సిటీలోని ఇళ్లలో బంగారు నగలు, నగదు క్లీన్ గా లూటీ చేస్తూ పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు.
మంగళూరులోని కంకనాడిలో మొహమ్మద్ సాధిక్ అలియాస్ సాధిక్ (31) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 10వ తరగతి ఫెయిల్ అయిన సాధిక్ కు పని చెయ్యడానికి మంగళూరులో ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. బెంగళూరు చేరుకున్న సాధిక్ ఇక్కడి సిటీ మార్కెట్ లోని ఓ ఫేమస్ హోటల్ లో పనికి చేరాడు.

హోటల్ లో పగలు టేబుల్స్ క్లీన్ చేస్తున్న సాధిక్ రాత్రి హోటల్ లో ఉద్యోగులు నిద్రపోవడానికి ఉన్న రూమ్ లో నిద్రపోతున్నాడు. రాత్రిపూట సాధిక్ హోటల్ బయటకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఇటీవల సిల్క్ ఫోరమ్ సమీపంలోని దివ్య రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న రామచంద్ర అనే వ్యక్తి ఫ్లాట్ కిటికీ పగలగొట్టిన నగలు, నగదు లూటీ చేశారు.
కేసు విచారణ చేస్తున్న పోలీసులకు అర్దరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న సాధిక్ చిక్కాడు. రామచంద్ర ఇంట్లో నగలు, నగదు లూటీ చేసింది నేనే అని సాధిక్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. సాధిక్ ను అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి రూ. 18 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు బెంగళూరులో అనేక ప్రాంతాల్లో సాధిక్ చోరీలు చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. పగలు హోటల్ లో క్లీన్ చేస్తున్న సాధిక్ రాత్రి పూట సీక్రేట్ గా ఇళ్లకు తాళాలు వేసిన విషయం గుర్తించి ఆ ఇళ్లల్లో నగలు, నగదు లూటీ చేస్తున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications