Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Secret: రాత్రి ఇంటికి వెళ్లిన భర్త, వంటరూమ్ లో పక్కింటోడు ?, భార్యకు చెమటలు, కత్తితో కసక్, భర్తకు !

బెంగళూరు: పెళ్లి చేసుకుని భార్యతో కలిసి జీవిస్తున్న వ్యక్తి మెన్స్ హెయిల్ స్టైల్స్ షాపు నిర్వహిస్తున్నాడు. ఉదయం 6 గంటలకు షాపుకు వెలుతున్న భర్త రాత్రి ఎప్పుడో ఇంటికి తిరిగి వెలుతుంటాడు. ఇంట్లో అతని భార్య మాత్రమే ఉంటున్నది. దంపతుల ఇంటి పక్కన ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు. భర్త అర్దరాత్రి కూడా ఇంటికి సక్రమంగా ఇంటికి రాకపోవడంతో అతని భార్యకు అనుమానం వచ్చింది. భర్త గురించి తెలుసుకోవాలని అతని భార్య అనేక ప్రయత్నాలు చేసింది. ఇదే సమయంలో పక్కింటి కుర్రాడు ఆమెకు సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టాడు. నా భర్త రహస్యాలు తెలుసుకుని నాకు చెప్పాలని భార్య పక్కింటి యువకుడికి నైస్ గా చెప్పింది. ఇదే సమయంలో భర్త అతని ప్రియురాలితో తిరుగుతూ పక్కింటి కుర్రాడికి చిక్కిపోయాడు. పక్కింటి వ్యక్తి అతని ప్రియురాలు కలిసి తిరుగుతున్న సమయంలో ఫోటోలు తీసిన యువకుడు అతని భార్యకు ఇచ్చాడు. ఆ ఫోటోల కారణంగా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రాత్రి భర్త ఆవేశంగా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో వంట గదిలో పక్కింటి కుర్రాడు దాక్కొని ఉండటం, భార్యకు పూర్తిగా చెమటలు పట్టి ఉన్న విషయం గుర్తించిన భర్త రగిలిపోయాడు. అంతే వంట గదిలో ఉన్న కత్తి తీసుకున్న భర్త పక్కింటి కుర్రాడి ముఖం చెక్కేయడం కలకలం రేపింది.

 హెయిల్ స్టైల్స్ షాపు నిర్వహిస్తున్న భర్త

హెయిల్ స్టైల్స్ షాపు నిర్వహిస్తున్న భర్త

ఐటీ హబ్ బెంగళూరులోని మల్లేశ్వరంలోని మునేశ్వర బ్లాక్ లో రమేష్, దివ్యా (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. రమేష్ మల్లేశ్వరంలో మెన్స్ హెయిల్ స్టైల్స్ షాపు నిర్వహిస్తున్నాడు. ఉదయం 6 గంటలకు షాపుకు వెలుతున్న రమేష్ రాత్రి ఎప్పుడో ఇంటికి తిరిగి వెలుతుంటాడు. ఇంట్లో రమేష్ భార్య దివ్యా మాత్రమే ఉంటున్నది.

 పక్కింటిలో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి

పక్కింటిలో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి

రమేష్, దివ్యా దంపతులు నివాసం ఉంటున్న వారి ఇంటి పక్కనే సాగర్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సాగర్ బెంగళూరులోని ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటి దగ్గర ఒక్కటే ఉంటున్న రమేష్ భార్య దివ్యాకు పక్కింటి కుర్రాడు సాగర్ కు పరిచయం అయ్యింది. ప్రతిరోజూ సాగర్, పక్కింటి మహిళ దివ్యా మాట్లాడుకుంటున్నారు.

 భర్త మీద భార్యకు అనుమానం మొదలైయ్యింది

భర్త మీద భార్యకు అనుమానం మొదలైయ్యింది

గత ఏడాది నుంచి భర్త రమేష్ అర్దరాత్రి అయినా ఇంటికి సక్రమంగా రాకపోవడంతో అతని భార్య దివ్యాకు అనుమానం వచ్చింది. భర్త రమేష్ ఎక్కడికి వెలుతున్నాడు ? రాత్రి పూట షాపు మూసివేసిన తరువాత అతను ఎక్కడికి వెలుతున్నాడు అని తెలుసుకోవాలని అతని భార్య దివ్యా చాలాకాలం అనేక ప్రయత్నాలు చేసింది.

 కుర్రాడిని రంగంలోకి దింపింది

కుర్రాడిని రంగంలోకి దింపింది

ఇదే సమయంలో పక్కింటి కుర్రాడు సాగర్ దివ్యాతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టాడు. కొంతకాలం సాగర్ కు టీలు, టిఫిన్ లు, భోజనాలు పెడుతున్న దివ్యా అతనికి ఇంకా దగ్గర అయ్యింది. తరువాత నా భర్త రమేష్ ప్రతిరోజు ఎక్కడెక్కిడికి వెలుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనే రహస్యాలు తెలుసుకుని నాకు చెప్పాలని దివ్యా ఆమె పక్కింటి కుర్రాడు సాగర్ కు నైస్ గా చెప్పింది.

 భర్తకు గర్ల్ ఫ్రెండ్

భర్తకు గర్ల్ ఫ్రెండ్

పక్కింటి మహిళ అంత నైస్ గా చెప్పడంతో సాగర్ రంగంలోకి దిగాడు. పక్కింటిలో నివాసం ఉంటున్న రమేష్ మీద గూడాచార్యం చెయ్యడం మొదలు పెట్టాడు. రమేష్ షాపు ఉన్న మునేశ్వర బ్లాక్ ప్రాంతం నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ఉన్న ఏరియాలో అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉందని సాగర్ గుర్తించాడు. కొన్ని రోజుల పాటు రమేష్ కు తెలీకుండా అతన్ని సాగర్ ఫాలో అయ్యాడు.

 భర్త రొమాన్స్ ఫోటోలు తీసిన పక్కింటోడు

భర్త రొమాన్స్ ఫోటోలు తీసిన పక్కింటోడు

ఇదే సమయంలో దివ్యా భర్త రమేష్ అతని ప్రియురాలితో తిరుగుతూ, ఆమెతో రొమాన్స్ చేస్తూ అతని పక్కింటి కుర్రాడు సాగర్ కు చిక్కిపోయాడు. పక్కింటి రమేష్, అతని ప్రియురాలు కలిసి తిరుగుతూ రొమాన్స్ చేస్తున్న సమయంలో ఫోటోలు తీసిన సాగర్ వాటిని పక్కింటి మహిళ దివ్యాకు ఇచ్చాడు. భర్త రమేష్ రొమాన్స్ ఫోటోలు చూసిన దివ్యా రగిలిపోయింది. ఆ ఫోటోల కారణంగా రమేష్, దివ్యా దంపతుల మద్య రానురాను గొడవలు మొదలైనాయి.

 మహిళతో ఇంకా చనువు పెంచుకున్న కుర్రాడు

మహిళతో ఇంకా చనువు పెంచుకున్న కుర్రాడు

భర్త రమేష్ అతని భార్య దివ్యా దెబ్బకు ఇంటికి ఇంకాలేటుగా రావడం మొదలుపెట్టాడు. ఇదే సమయంలో దివ్యా పక్కింటి యువకుడు సాగర్ తో క్లోజ్ గా ఉండటం మొదలు పెట్టింది. రాత్రి అనుకోకుండా రమేష్ ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతని ఇంటిలో సాగర్ ఉన్నాడు. భర్త రమేష్ ఎంట్రీ ఇవ్వడంతో దివ్యా పక్కింటి కుర్రాడు సాగర్ ను ఆమె ఇంటి వంట గదిలో దాచిపెట్టింది.

 వంటగదిలో నుంచి పక్కింటోడిని బయటకు లాగిన భర్త

వంటగదిలో నుంచి పక్కింటోడిని బయటకు లాగిన భర్త

ఇంట్లోకి వెళ్లిన రమేష్ అతని భార్య దివ్యాకు పూర్తిగా చెమటలు పట్టి ఆందోళనగా కనిపించింది. రమేష్ కు అనుమానం మొదలైయ్యింది. ఇంటి మెయిన్ రోడ్ లాక్ చేసిన రమేష్ ఇంట్లో ప్రతిరూమ్ వెతికాడు. ఆ సమయంలో వంటదిలో కబోడ్స్ లో దాక్కొన్న సాగర్ ను చూసిన రమేష్ రగిలిపోయాడు. ఆ సమయంలో సాగర్ ను బయటకు లాగిన రమేష్ వీడు ఎందుకు ఇక్కడ ఉన్నాడు అని అతని భార్యను ప్రశ్నించాడు.

 కత్తితో పక్కింటోడి ముఖం చెక్కేసిన భర్త

కత్తితో పక్కింటోడి ముఖం చెక్కేసిన భర్త

ఆ సమయంలో నువ్వు బయట ఏం చేస్తున్నావో నేను ఇక్కడ అదే చేస్తున్నానని దివ్యా రెచ్చిపోయింది. తరువాత సహనం కోల్పోయిన రమేష్ వంటగదిలో ఉన్న కత్తి తీసుకుని అక్కడ చిక్కిన సాగర్ ముఖం మీద దాడి చేసి చెక్కేశాడు. సాగర్ భయంతో తప్పించుకుని బయటకు పరుగు తీశాడు. తరువాత ఇంటికి తాళం వేసిన రమేష్ అతని భార్ దివ్యాను పిలుచుకుని మాయం అయిపోయాడు. ముఖం మీద తీవ్రగాయాలైన సాగర్ వయ్యాలికావెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Recommended Video

    Paella Valenciana : Spain’s Most Famous Dish - The Secrets Behind
     పక్కింటి ఆంటీ భర్త మీద కేసు పెట్టిన యువకుడు

    పక్కింటి ఆంటీ భర్త మీద కేసు పెట్టిన యువకుడు

    ఆయుధాలు ఉపయోగించిన రమేష్ సాగర్ మీద హత్యాయత్నం చేశాడని కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. తన మీద గూడాచార్యం చేసిన సాగర్ తన కాపురంలో చిచ్చు పెట్టాడని, అంతే కాకుండా నేను లేని సమయంలో తన ఇంటికి వచ్చి తన భార్యతో క్లోజ్ గా ఉంటూ టైమ్ కాని టైమ్ లో వంట గదిలో దాక్కొన్నాడనే కోపంతోనే రమేష్ అతని పక్కింటిలో నివాసం ఉంటున్న సాగర్ మీద హత్యాయత్నం చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+