చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళ ఎఫెక్ట్: పోయెస్ గార్డెన్ లో పోలీసులు ప్రత్యక్షం

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నివాసం ఉంటున్న పోయెస్ గార్డెన్ లోని వేద నిలయంలో మళ్లీ పోలీసులు ప్రత్యక్షం అయ్యారు. వేద నిలయంలోకి వచ్చి వెళ్లే వాహనాలు అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

<strong>శశికళ VS స్టాలిన్: వార్ వన్ సైడ్, పాపం చిన్నమ్మ!</strong>శశికళ VS స్టాలిన్: వార్ వన్ సైడ్, పాపం చిన్నమ్మ!

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవించివున్నంత వరకు పోయెస్ గార్డెన్ లోని వేద నిలయంలో భారీ భద్రత ఉండేది. జయలలిత మరణించిన తరువాత ఆమె నెచ్చెలి శశికళ ఇప్పుడు వేద నిలయంలో నివాసం ఉంటున్నారు.

Security arrangements at the Poes Garden residence of the former CM Jayalalithaa

జయలలిత లేకపోయినా అక్కడ 240 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రత కొనసాగింది. జయలలిత మరణించినా పోయెస్ గార్డెన్ లోని వేద నిలయం దగ్గర పోలీసు భద్రత ఎందుకు కొనసాగిస్తున్నారని, శశికళకు ఏ హోదా ఉందని ప్రతిపక్ష నేత ఎంకే. స్టాలిన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

<strong>చెప్పింది చెయ్యండి, చరిత్ర అడగద్దు: శశకళ వార్నింగ్!</strong>చెప్పింది చెయ్యండి, చరిత్ర అడగద్దు: శశకళ వార్నింగ్!

ఈ విషయంపై స్టాలిన్ గవర్నర్ కు లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకులు అందరూ విమర్శలు చెయ్యడంతో పోలీసు భద్రతను తొలగించారు. కేవలం నలుగురు పోలీసులు మాత్రమే అక్కడ భద్రతా కొనసాగించారు.

అధికార పార్టీ (అన్నాడీఎంకే) ప్రధాన కార్యదర్శిగా శశికళను నియమించడంతో మళ్లీ పోలీసులు పోయెస్ గార్డెన్ లోని వేద నిలయంలో ప్రత్యక్షం అయ్యారు. అధికార పార్టీ చీఫ్ గా ఉన్న శశికళకు భద్రత కల్పిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Stalin said a total of 240 security personnel, including a Superintendent of Police (SP), four additional SPs, four Deputy SPs, seven inspectors, many sub-inspectors, head constables and constables were on duty on three shifts. They are lodged in a house opposite to Jayalalithaa’s residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X