లోక్‌సభలో ఊహించని పరిణామం:మోడీకి వ్యతిరేకంగా.. సభలో దూకేందుకు యత్నం..
మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. సభ లోపలికి దూకేందుకు ప్రయత్నించడంతో.. ఒక్కసారిగా సభలో అలజడి రేగింది.
న్యూఢిల్లీ : ఓవైపు నోట్ల రద్దుపై విపక్షాల ఆందోళనతో లోక్ సభ దద్దరిల్లుతుంటే.. మరోవైపు విజిటర్స్ గ్యాలరీ నుంచి ఓ యువకుడు సభలోకి దూకే ప్రయత్నం చేసి కలకలం సృష్టించాడు. మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. లోపలికి దూకేందుకు ప్రయత్నించడంతో.. ఒక్కసారిగా సభలో అలజడి రేగింది.

క్షణాల్లో అప్రమత్తమైన మార్షల్స్ అతన్ని సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతను మార్షల్స్ అదుపులోనే ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ సభ్యుల విజిటింగ్ పాస్ తో అతను లోపలికి ప్రవేశించినట్టు సమాచారం. కాగా, సభలో ఇలాంటి అలజడి రేగడం బహుశా ఇదే తొలిసారని లోక్ సభ సభ్యులు చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ హఠాత్పరిణామంతో ఇకనుంచి విజిటర్స్ నిబంధనలను కఠినతరం చేయనున్నారు.












Click it and Unblock the Notifications