అపార్ట్ మెంట్ లో స్నానం చేస్తున్న మహిళ, కిటికీలో వీడియో తీసిన సెక్యూరిటీ గార్డు, చివరికి !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బెంగళూరులోని ఓ అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే వీడియో తీసిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని బెళ్లందూరులోని అపార్ట్ మెంట్ లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న భాస్కర్ అహాల్దార్ అనే యువకుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

బెళ్లందూరులోని అపార్ట్ మెంట్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త ఉద్యోగానికి వెళ్లిన తరువాత ఆమె బాత్ రూంలో స్నానం చెయ్యడానికి వెళ్లారు. ఆ సందర్బంలో ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళ స్నానం చేస్తున్నదని గుర్తించిన భాస్కర్ అక్కడికి వెళ్లాడు.

Security Guard Arrest For Capturing Woman Bathing in Bengaluru

మహిళ స్నానం చేస్తున్న సమయంలో కిటికీలో నుంచి మొబైల్ లో మొత్తం వీడియో తీశాడు. కిటికి దగ్గర చప్పుడు అయిన విషయం గుర్తించిన మహిళ తిరిగి చూసే సమయానికి భాస్కర్ పారియాడు. స్నానం చేసి బయటకు వచ్చిన మహిళ సీసీ కెమెరాలు పరిశీలించగా అక్కడ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న భాస్కర్ వీడియో తీసిన విషయం వెలుగు చూసింది. మహిళ భర్త ఫిర్యాదు చెయ్యడంతో బెళ్లందూరు పోలీసులు భాస్కర్ ను అరెస్టు చేసి మొబైల్ స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Security Guard Arrest For Capturing Woman Bathing in Bengaluru in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి