కీచక చర్య: అసభ్యంగా, మహిళ చీర లాగి వివస్త్రను చేయబోయి..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటటల్‌లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మహిళా ఉద్యోగి పట్ల సెక్యురిటీ మేనేజర్ అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె చీరలాగి వివస్తన్రు చేయడానికి ప్రయత్నించాడు.

ఆ సెక్యూరిటీ మేనేజర్‌ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట చేశారు. ఈ సంఘటనపై బాధితురాలు గత నెల 30నే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన సిసిటీవీ దృశ్యాలు శుక్రవారం టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి.

దాంతో పోలీసులు సెక్యూరిటీ మేనేజర్‌ను అరెస్టు చేశారు. నిందితుడ్ని ప్రశ్నించడంతో పాటుగా బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రాథమికంగా నిందితుడు తప్పు చేసినట్లు భావించడంతో అతడ్ని అరెస్టు చేశారు.

శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ...

శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ...

అరెస్టు తర్వాత తదుపరి విచారణ జరుగుతోందని ఢిల్లీ పోలీసు ముఖ్య అధికార ప్రతినిధి దీపేంద్ర పాఠక్ చెప్పారు. సెక్యూరిటీ మేనేజర్ తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ కొంతకాలంగా తనను ఒత్తిడి చేస్తున్నాడని, అయితే తాను ప్రతిఘటిస్తూ వస్తున్నానని బాధితురాలు తెలిపింది.

బర్త్ డే పార్టీకి పిలిచి...

బర్త్ డే పార్టీకి పిలిచి...

జూలై 29న తన పుట్టిన రోజని, ఆ రోజున సెక్యూరిటీ మేనేజర్ తనను తన రూమ్‌లో బర్త్‌డే పార్టీ కోసం పిలిచాడని, గిఫ్ట్‌లు కూడా ఇవ్వజూపాడని, ఆ తర్వాత తన చీర లాగడానికి ప్రయత్నించాడని బాధితురాలు తెలిపింది. అయితే తాను విడిపించుకొని హోటల్ హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేశానని, అయితే సెక్యూరిటీ మేనేజర్‌పై చర్య తీసుకోవడానికి బదులు తననే ఉద్యోగంనుంచి యాజమాన్యం తీసేసిందని ఆమె చెప్పింది.

పోలీసులకు ఫిర్యాదు....

పోలీసులకు ఫిర్యాదు....

తన భర్త సాయంతో సంఘటనప పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. బాధితురాలు ఫిర్యాదు చేసిన తర్వాత స్టేట్‌మెంట్ నమోదు చేసుకొని ఆమె ఇచ్చిన సాక్ష్యాధారాలను, సిసి టీవీ దృశ్యాలను క్రాస్ చెక్ చేయడం జరిగిందని పాఠక్ చెప్పారు. అయితే పోలీసు విచారణలో నిందితుడు బాధితురాలిపైనే ప్రత్యారోపణలు చేసినట్లు చెప్తున్నారు. నిందితుడికి బెయిల్ మంజూరైంది.

ఇలా చేశాడు...

ఇలా చేశాడు...

"నా పుట్టిన రోజు తెలుసుకున్న పవన్‌ దహియా తన డెబిట్‌ కార్డు తీసి ఇష్టమైన గిఫ్ట్‌ కొనుక్కోమని నాకు సూచించాడు. ఆ తర్వాత పవన్‌ కూర్చోవల్సిందిగా కోరడంతో నేను నిరాకరించాను. వెంటనే అతడు నన్ను తన వైపు లాక్కునేందుకు ప్రయత్నించాడు. నేను తీవ్రంగా ప్రతిఘటించాను. ఆ సమయంలో అక్కడ ఉన్న సహోద్యోగులను బయటికి వెళ్లిపోమని ఆదేశించాడు. అనంతరం నా చీర కొంగు పట్టుకుని లాగాడు" అని బాధితురాలు చెప్పింది.

ఇలా బయటకు....

ఇలా బయటకు....

మహిళా ఉద్యోగి పట్ల పవన్‌ అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. హోటల్‌లో పని చేస్తున్న ఓ వ్యక్తి సాయంతో బాధితురాలు ఆ వీడియోను పోలీసులకు అందజేసింది. సంఘటన తర్వాత బాధితురాలు గురువారం మధ్యాహ్నం విధులకు హాజరయ్యేందుకు వెళ్లింది. అయితే,హెచ్‌ఆర్‌ సిబ్బందిని కలవాలని డ్యూటీ మేనేజర్‌ని కోరగా వారు కొద్దిసేపు ఆగాల్సిందిగా సూచించారు. సుమారు 40 నిమిషాల తర్వాత ఆమెను విధుల నుంచి తొలగించినట్లు సిబ్బంది నోటీసులు అందించారు. అలాగే బాధితురాలికి వీడియో ఫుటేజీ అందించిన వ్యక్తిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+