సోనియా గాంధీ ఇంటి గేట్ ముందే సిద్దరామయ్యను నిలేసిన సెక్యూరిటీ, సీఎం అయితే!

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేసి వారం రోజులు అయ్యింది. గత 15 రోజుల నుంచి సిద్దరామయ్య ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. మంత్రి వర్గం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సోనియా గాంధీ నివాసం ముందు కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు అవమానం జరిగిందని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దక్షిణ భారతదేశంలోని ఓ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశామని కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖుషీగా ఉన్నారు. డీకే శివకుమార్ ను ఢీకొట్టి చివరికి సీఎం పదవి దక్కించుకున్న సిద్దరామయ్య కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసి మంత్రివర్గం విస్తరణ కోసం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నారు.

Security personnel stopped CM Siddaramaiahs car in front of the gate of Sonia Gandhis house

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో అనేకసార్లు చర్చలు జరిపిన సిద్దరామయ్య శుక్రవారం మరోసారి హైకమాండ్ తో చర్చలు జరిపారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర గుర్తింపు తెచ్చుకున్న 24 మందికి మంత్రిపదవులు దక్కాయి. మంత్రి పదవుల కోసం జరుగుతున్న చర్చలు శుక్రవారం రోజే ఓ కొలిక్కి వచ్చాయి.

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో చర్చలు పూర్తి అయిన తరువాత సిద్దరామయ్య ఆయన కారులో సోనియా గాంధీ ఇంటికి బయలుదేరారు. అయితే సోనియా గాంధీ ఇంటి గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కర్ణాటక సీఎం సిద్దరామయ్య కారును అడ్డుకున్నారు. కారులో కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఉన్నారని, ఆయన లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలసి సీఎం భద్రతా సిబ్బంది. ఆయన పీఏలు సోనియా గాంధీ ఇంటి ముందు ఉన్న సెక్యూరిటీకి చెప్పారని సమాచారం.

Security personnel stopped CM Siddaramaiahs car in front of the gate of Sonia Gandhis house

అయితే సోనియా గాంధీ నివాసం దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది మాత్రం సిద్దరామయ్య కారు లోపలికి వెళ్లడానికి చాలాసేపు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పీఏలు, భద్రతా సిబ్బంది సోనియా గాంధీ ఇంటి ముందు ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో చర్చలు జరిపారని సమాచారం.

చాలా సేపు గేట్ బయట సిద్దరామయ్య కారు నిలిపేసిన సెక్యూరిటీ సిబ్బంది తరువాత సోనియా గాంధీ నివాసంలోకి సిద్దరామయ్య కారు వెళ్లడానికి అవకాశం ఇచ్చారని వెలుగు చూసింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు సోనియా గాంధీ ఇంటి ముందు అవమానం జరిగిందని కన్నడ మీడియాలో జోరుగా వార్తలు ప్రసారం అయ్యాయి. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాని. సిద్దరామయ్య కాని ఇంత వరకు క్లారటీ ఇవ్వలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+