బలవంతంగా మహిళా కలెక్టర్‌తో సెల్ఫీ: జైలు పాలు
ఉత్తరప్రదేశ్: మహిళా కలెక్టర్ కు ఇష్టం లేకపోయినా ఆమెను ఇబ్బంది పెట్టి సెల్ఫీ తీసుకున్న ఓ యువకుడు జైలు పాలైనాడు. కలెక్టర్ ను ఎదురించిన అతనిని రిమాండ్ కు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్ లోని బులందేషహర్ జిల్లా మెజిస్ట్రేట్ (కలెక్టర్ )గా బి. కళావతి పని చేస్తున్నారు. ఈమె సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె దృష్టికి ఏదైనా సమస్య తీసుకు వెళితే కచ్చితంగా పరిష్కారం చేస్తారని ఆ జిల్లా ప్రజల నమ్మకం.
మహిళా కలెక్టర్ అదే విధంగా పని చేస్తున్నారు. కమల్ పూర్ అనే గ్రామం నుంచి కొందరు వ్యక్తులు కళావతిని కలవడానికి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. అప్పుడే అక్కడ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు.

ఆ జనంలో నుంచి అహమ్మద్ (18) అనే యువకుడు కలెక్టర్ చంద్రకళాకు అతి సమీపంలోకి వెళ్లాడు. తరువాత సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో మహిళా కలెక్టర్ కళావతి సెల్ఫీ తీసుకోరాదని ఆ యువకుడిని వారించారు. అయితే అప్పటికే సెల్ఫీ తీశాడు
సెల్ఫీ డిలిట్ చెయ్యాలని కళావతి మర్యాదగా ఆ యువకుడికి చెప్పారు. అయితే ఫోటో ఎందుకు డిలీట్ చెయ్యాలి, ఇది నాఫోన్, నాఇష్టం, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ ఊగిపోయాడు. కలెక్టర్ కళావతికి కోపం రావడంతో అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఇతనిని అరెస్టు చెయ్యాలని సూచించారు.
కోర్టు ఆదేశాల మేరకు అహమ్మద్ ను పోలీసులు జైలుకు పంపించారు. ఫోటో తీసేది నన్ను, అయినా తాను కచ్చితంగా అడ్డు చెబుతానని, ఇబ్బందికి గురి చేసే చర్యను అడ్డుకోవడం నా హక్కు అంటూ కలెక్టర్ కళావతి మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications