చిత్రకళ ప్రదర్శనలో హాఫ్ న్యూడ్ చిత్రాలపై రచ్చ..

అర్దనగ్న చిత్రాలను ప్రదర్శిస్తున్నారన్న కారణంగా.. ఓ చిత్రకళ ప్రదర్శనపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

జైపూర్: ఓ చిత్రకళ ప్రదర్శనపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి నానా రచ్చ చేశారు. కొన్ని పెయింటింగ్స్ ను ఎత్తుకెళ్లడంతో పాటు మరికొన్నింటిని కిందపడేసి ధ్వంసం చేశారు. గురువారం నాడు జైపూర్ లో ఏర్పాటు చేసిన ఓ చిత్రకళ ప్రదర్శనలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అర్దనగ్న చిత్రాలను ప్రదర్శిస్తున్నారన్న కారణంగా.. కొంతమంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఓ కళాకారుడిపై చేయి కూడా చేసుకున్నారు. అర్దనగ్న చిత్రాల ప్రదర్శన సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తుల్లో ఓ మహిళ కూడా ఉంది.

Rajasthan

అర్దనగ్న చిత్రాలు వేసిన పెయింటర్ కు ఆమె వార్నింగ్ ఇస్తుండగా.. ఆమె వెనకాల ఉన్న మరో వ్యక్తి వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. ఈ తతంగమంతా సీసీటీవి ఫుటేజీలో రికార్డయినట్టుగా తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నా.. ఆలోపే వారు అక్కడినుంచి పరారయ్యారు. ఘటనకు బాధ్యులైన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+