మా అధికారే నాపై కోర్టు, పత్రాలిచ్చాడు: రంజిత్ సిన్హా
న్యూఢిల్లీ: తమ సంస్థలో డీఐజీ ర్యాంకు సీనియర్ అధికారి సంతోష్ రస్తోగి తనపై కోవర్ట్ వ్యవహారాలు నడిపినట్లు సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తనపై అబద్ధపు-నిరాధార ఆరోపణలు చేయడానికి వీలుకల్పించేలా కొన్ని పత్రాలను అందజేసిందని ఆయనేనని ఆరోపించారు. చీఫ్ జస్టిస్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణ సందర్భంగా ఆయన ఈ మేరకు వివరించారు.
నాలుగున్నర గంటలపాటు సాగిన విచారణలో సిన్హా తరఫు న్యాయవాది వికాస్‌రాజ్, ప్రశాంత్ భూషణ్ తరఫు న్యాయవాది దుష్యంత్ దవేల మధ్య వాదోపవాదాలు తీవ్రమవడంతో జస్టిస్ దత్తు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. సిబిఐలో ‘గూఢచారి' ఉన్నారని, ఆయనే న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు పత్రాలు అందజేస్తున్నాడని సంస్థ చీఫ్ రంజిత్ సిన్హా సుప్రీం కోర్టుకు తెలిపారు. సీనియర్ ఐపిఎస్ అధికారి సిబిఐకి చెందిన సమాచారం చేరవేయడంవల్లే తనపై అభూతకల్పనలు, అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
2జి స్పెక్ట్రమ్ నిందితులతో సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా మంతనాలు సాగించేవారని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు సారధ్యంలోని ధర్మాసనం బుధవారం కేసు విచారణ చేపట్టిన సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఇరుపక్షాల మధ్య నాలుగున్నర గంటల సేపు వాడీవేడిగా వాదోపవాదాలు జరిగాయి. సిబిఐ డైరెక్టర్ సిన్హా తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. 2జి స్పెక్ట్రమ్ నిందితులతో సిన్హా ప్రైవేటుగా భేటీ అయ్యేవారన్న ఆరోపణలు అవాస్తవమని సింగ్ కోర్టు దృష్టికి తెచ్చారు. నిందితులెవరినీ రక్షించడానికి డైరెక్టర్ ప్రయత్నించలేదని ఆయన అన్నారు.
స్వచ్ఛంద సంస్థ అందజేసిన పత్రాలను ఆసరా చేసుకుని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని అందులో ఎలాంటి వాస్తవాలు లేవని వికాస్ స్పష్టం చేశారు. సిబిఐలో డిఐజి ర్యాంక్ అధికారి సంతోష్ రస్తోగి అందజేసిన సమాచారం ఆధారంగానే పిల్ దాఖలయిందని ఆయన ఆరోపించారు. ‘రస్తోగినే సమాచారం అంతా చేరవేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. సిబిఐలో ఆయన ‘గూఢచారి'గా పనిచేస్తున్నారు' అని రంజిత్ సిన్హా కోర్టుకు తెలిపారు. అయితే సిబిఐ డైరెక్టర్ సిన్హా 2జి స్పెక్ట్రమ్ నిందితులతో ఎందుకు చర్చలు జరపాల్సి వచ్చిందని పిటిషనర్ పక్షాన న్యాయవాది దుష్యంత్ దావే అడిగిన ప్రశ్నలకు వికాస్ సింగ్ ఎలాంటి వివరణ ఇవ్వలేకపోయారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications