లొంగకపోవడం వల్లే టెక్కీ హత్య,సీనియర్ ఉద్యోగే కారణమా?

తన కూతురిని హత్య చేసేందుకే ఆదివారం నాడు ఒంటరిగా కార్యాలయానికి పిలిపించారని పూణెలో హత్యకు గురైన ఇన్సోసిస్ ఉద్యోగిని తండ్రి , మాజీ ఆర్మీ అదికారి రాజు ఆరోపించాడు.

పూణె: తన కూతురిని హత్య చేసేందుకే ఆదివారం నాడు ఒంటరిగా కార్యాలయానికి పిలిపించారని పూణెలో హత్యకు గురైన ఇన్సోసిస్ ఉద్యోగిని తండ్రి , మాజీ ఆర్మీ అదికారి రాజు ఆరోపించాడు.

మహరాష్ట్రలోని ఫూణె ఇన్పోసిస్ లో రశీల రాజు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అయితే ఆమె ఇటీవల హత్యకు గురైంది.

ఆమె ను ఆమె సీనియర్ ఉద్యోగి తరచూ వేధించేవాడని రశీలరాజు తండ్రి ఆరోపించాడు. అతనికి లొంగకపోవడంతోనే తన కుమార్తెను అంతమొందించేందుకు ప్లాన్ చేశాడని చెప్పారు.

senior employee harassed my daughter :techie father

ఆదివారం నాడు ఆఫీసుకు సెలవైనా తన కూతురికి ఫోన్ చేసి ఆఫీసుకు రావాలని చెప్పడంతో ఆమె కార్యాలయానికి వెళ్ళిందని ఆయన చెప్పారు.

మధ్యాహ్నం ఆఫీసుకు వెళ్ళిన ఆమె సాయంత్రం 9వ, అంతస్తులో సెక్యూరిటీ గార్డు సాయికియా హత్య చేశారు.అస్సాం రాష్ట్రానికి చెందిన సెక్యూరిటీ గార్డు సామాన్లు సర్ధుకొని పారిపోయే ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.

అయితే రశీల మరణానికి కోటి పరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబంలో మరోకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ఇన్పోసిస్ అంగీకరించింది. రశీల అంత్యక్రియలు కేరళలో జరిగాయి.

పూణెలో తనకు పనిచేయడం ఇష్టం లేదని, బెంగుళూరుకు బదిలీ చేయాలని కోరిన విషయాన్ని కుటుంబసభ్యులు గుర్తుచేశారు. ,రశీల తల్లి రెండేళ్ళ క్రితం మరణించింది. ఆమె సోదరుడు గల్ప్ లో ఉద్యోగం చేస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+