స్టాక్ మార్కెట్: వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగింపు, జోష్‌లో ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ రంగాలు!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో బాగా కోలుకున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్ల మేర లాభపడగా... నిఫ్టీ 10,550 పైకి ఎగిసింది. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల ర్యాలీలో స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించింది.
సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో ట్రేడవుతున్న నిఫ్టీ ఫ్యూచర్స్ నుంచి బలమైన సంకేతాలు రావడంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా బలపడ్డాయి. గత ఏడురోజులుగా మదుపరులు చవిచూసిన నష్టాలకు గురువారం బ్రేక్ పడింది.

ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ మినహా హెల్త్ కేర్, ఐటీ, రియాల్టీ, ఫార్మా, బ్యాంకింగ్ తదితర సూచీలన్నీ గ్రీన్ లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 330 పాయింట్ల లాభంతో 34,413కు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 10,577 వద్ద క్లోజ్ అయింది.
గురువారం దాదాపు అన్ని సెక్టార్లలో కొనుగోళ్ల సందడి కనిపించింది. దీంతో సెన్సెక్స్ రోజంతా భారీ లాభాలతో కదలాడింది. ఫార్మా రంగం టాప్ విన్నర్‌గా ఉండగా పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ , మెటల్, ఐటీ, ఆటో రంగాల షేర్లు లాభపడ్డాయి.
ప్రధానంగా సన్ ఫార్మా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ లాంటి ఇండెక్స్ హెవీవెయిట్స్ బాగా లాభపడ్డాయి. సిప్లా, అంబుజా, ఇన్‌ఫ్రాటెల్, ఐబీ హౌసింగ్, యూపీఎల్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ లాభాల్లో ముగియగా.. అరబిందో, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్, ఐటీసీ, టాటా మోటర్స్, హిందాల్కో నష్టాల్లో ముగిశాయి.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications