వారి నుంచి కాపాడ్డానికి తీసుకెళ్లారు, అబ్బాయితో ఎందుకంటూ.. పోలీసులే ఆమెను కొట్టారు
లక్నో: మరో వర్గం అబ్బాయితో సన్నిహితంగా ఉంటోందని ఓ యువతిని పోలీసులు వ్యానులో వేధించారు. ఈ సంఘటన యూపీలోని మీరట్‌లో చోటు చేసుకుంది. దానిని పోలీసులు వీడియో కూడా తీశారు. ఇది సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తగా, సదరు పోలీసులను అధికారులు సస్పెండ్ చేసి, దర్యాఫ్తుకు ఆదేశాలు జారీ చేశారు.
ఆ వీడియిలో ఓ యువతిని పోలీసులు వాహనంలోకి ఎక్కించుకున్నారు. ఆమె పక్కన ఓ మహిళా పోలీసు ఉన్నారు. మరో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. సదరు మహిళా కానిస్టేబుల్ ఆ యువతిపై మూడు నాలుగుసార్లు చేయి చేసుకున్నారు. మరో పోలీసు ఆ యువకుడితోనే ఎందుకు సన్నిహితంగా ఉంటున్నావని ప్రశ్నించాడు.

ముందు కూర్చున్న ఓ పోలీసు వాహనాన్ని నడుపుతూనే వీడియో కూడా తీశాడు. కాగా, ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియాల్సి ఉంది. అంతకుముందు, ఈ యువతి తన స్నేహితుడైన ఓ మరో వర్గం యువకుడి ఇంటికి వెళ్లింది. వైద్య విద్యార్థులైన ఇద్దరు కలిసి చదువుకుంటుండగా అక్కడకు చేరుకున్న వీహెచ్‌పీ కార్యకర్తలు వారిద్దరిని పోలీసులకు అప్పగించారు. వారిద్దరు ప్రేమించుకుంటున్నారని, లవ్ జిహాద్ కారణమన్నారు.
Meerut: Three police personnel including a woman constable suspended after a video of them abusing and slapping a woman for being friends with a Muslim man, went viral pic.twitter.com/ypqO5dxFbK
— ANI UP (@ANINewsUP) September 25, 2018
వారిపై వీహెచ్‌పీ కార్యకర్తలు దాడి చేయకుండా ఆ యువతిని కాపాడేందుకు పోలీసులు ఆమెను తమ వాహనంలో ఎక్కించుకున్నారు. కానీ ఆ తర్వాత వారే స్వయంగా చేయి చేసుకున్నారు. యువతిని, యువకుడిని వేర్వేరు వాహనాల్లో తీసుకెళ్లారు.
దీనిపై పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ... పోలీసులు తమ బాధ్యత మరిచిపోయారని, అందుకే వారిని సస్పెండ్ చేశామని, దర్యాఫ్తు చేస్తున్నామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications