ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలోకి ఎమ్మెల్యే అదితి సింగ్, సోనియా నియోజకవర్గంలోనే

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాయ్ బరేలి సదర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే అదితి సింగ్.. అధికార భారతీయ జనతా పార్టీలో చేరారు. రాయ్ బరేలీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉన్న విషయం తెలిసిందే. రాయ్ బరేలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచే సోనియా గాంధీ ఎంపీగా ఉన్నారు.

1980 నుంచి 1996, 1998 మినహా ప్రతి లోక్‌సభ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీకే ఇక్కడి రాయ్ బరేలి ఓటర్లు పట్టం కట్టారు. 1996, 1998 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అశోక్ సింగ్ గెలుపొందారు. కాగా, అదితి సింగ్ తండ్రి అఖిలేష్ సింగ్ రాయ్ బరేలి సదర్ స్థానం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన గాంధీ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉండేవారు.

 Setback for Congress: Rebel MLA Aditi Singh Joins BJP Ahead Of UP assembly Polls

ఇక అదితి సింగ్ కూడా ప్రియాంక గాంధీ వాద్రాకు దగ్గరగా ఉండేవారు. ఆమెతో రాయ్ బరేలి వచ్చిన ప్రతిసారి ఫొటోలను కూడా దిగారు. అయితే, 2019 నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు అదితి సింగ్. అయితే, కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడలేదు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆమెపై అనర్హత వేటు విధించాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ను ఆశ్రయించింది. అయితే, స్పీకర్ మాత్రం అందుకు అంగీకరించలేదు.

ఈ క్రమంలో వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. అదితి సింగ్ బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఇక నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన నేపథ్యంలో ప్రియాంక గాంధీ వాద్రాపై అదితి సింగ్ మండిపడ్డారు. ప్రియాంక గాంధీకి వ్యవసాయ చట్టాలను తెచ్చినప్పుడూ సమస్యే.. ఇప్పుడు రద్దు చేసినా ఆమెకు సమస్యలానే కనిపిస్తోందంటూ అదితి సింగ్ విమర్శలు గుప్పించారు.

ప్రియాంక గాంధీకి భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం లేదంటూ మండిపడ్డారు అదితి సింగ్. కాగా, బీజేపీ నేతలు అతితి సింగ్ ను పార్టీకి చేర్చుకున్నారు. ఆమె చేరిక తమ పార్టీకి కలిసి వచ్చే అంశమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల అనంతరం వచ్చే ఫలితాల్లోనే ఆమె ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాస్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యూపీలో అన్ని వర్గాలను ఆదుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికే ప్రజలు మరోసారి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+