భారత్ నుంచి ఫాక్స్‌కాన్ అవుట్- రూ.వేల కోట్ల పెట్టుబడి వెనక్కి
న్యూఢిల్లీ: తైవాన్‌కు ప్రఖ్యాత సెమీకండక్టర్ల తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. భారత్‌లో పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరించుకుంది. దీని విలువ 19.5 బిలియన్ డాలర్లు. భారత్‌లో పెట్టుబడులను పెట్టాలనే ఆలోచనను వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఫాక్స్‌కాన్ తైవాన్‌కు చెందిన అతిపెద్ద సెమీకండక్టర్ల తయారీ కంపెనీ. ఆ మాటకొస్తే- ఎలక్ట్రానిక్ చిప్స్, సెమీకండక్టర్ల తయారీ సెగ్మెంట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ ఇది. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. దేశీయ పారిశ్రామికదిగ్గజం వేదాంతతో కలిసి జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది.

ఫాక్స్‌కాన్- వేదాంత జాయింట్ వెంచర్ కింద 19.5 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్‌మెంట్ కోసం ప్రణాళికలను రూపొందించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో సెమీకండక్టర్లు, చిప్ తయారీ కంపెనీని నెలకొల్పబోతోన్నట్లు గతంలో ప్రకటించింది. నిజానికి బెంగళూరు లేదా మహారాష్ట్రలో ఈ కంపెనీని స్థాపించాలని ఫాక్స్‌కాన్ భావించింది. చివరి నిమిషంలో- ఈ భారీ కంపెనీని గుజరాత్‌కు తరలించాలంటూ ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు.
తాజాగా ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకుంది ఫాక్స్‌కాన్. వేదాంతతో జాయింట్ వెంచర్‌ను వెనక్కి తీసుకుంది. వేదాంతతో కలిసి జాయింట్ వెంచర్‌గా ఆవిర్భవించాలనే ప్రతిపాదనలను వెనక్కి తీసుకున్నామని తెలిపింది. సెమీకండక్టర్ల తయారీ కంపెనీని నెలకొల్పడానికి ఏడాది కాలంగా వేదాంతతో కలిసి పని చేస్తోన్నామని, ఇక ముందుకు వెళ్లదలచుకోలేదని ఫాక్స్‌కాన్ యాజమాన్యం తెలిపింది.
అర్ధాంతరంగా వైదొలగడానికి గల కారణాలను కంపెనీ యాజమాన్యం వెల్లడించలేదు గానీ.. ప్రతిపాదనలను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేయడమేనని చెబుతున్నారు. తాము అందజేసిన ప్రతిపాదనలపై సత్వర ఆమోదం గానీ, ప్రోత్సాహక ఆమోదం గానీ లభించకపోవడం వల్ల ఫాక్స్‌కాన్ నిరాశక్తతను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
పారిశ్రామికరంగానికి కేటాయించే ప్రోత్సాహకాలను ఫాక్స్‌కాన్‌కు వర్తింపజేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల ప్రశ్నలను లేవనెత్తిందని, వాటన్నింటికీ సరైన, సంతృప్తికర సమాధానాలను ఇవ్వాలంటూ ఆదేశించినట్లు సమాచారం. ఫాక్స్‌కాన్ సంస్థ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. దీని ప్రభావం భారత పారిశ్రామికరంగంపై ఏ మాత్రం ఉండబోదని అన్నారు.












Click it and Unblock the Notifications