ఉత్తర ప్రదేశ్‌లో కూలిన హెలికాప్టర్, 7గురు మృతి

 Seven die in IAF helicopter crash
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్‌లో భారత వైమానికదళ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురుసిబ్బంది మృతి చెందారు. కూలిన హెలికాప్టర్‌ను భారత్ రూపొందించిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్)గా పోలీసులు గుర్తించారు.

బరేలీ నుండి అలహాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. గత మూడేళ్లలో పదకొండు ఐఏఫ్ హెలికాప్టర్లు కూలిపోయాయి.

మెదక్ రైలు ప్రమాద మృతులకు రాజ్యసభ సంతాపం

మెదక్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు రాజ్యసభ సంతాపం ప్రకటించింది. శుక్రవారం ఉదయం రాజ్యసభ ప్రారంభంకాగానే విద్యార్థులకు సంతాపం తెలుపుతూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని సభ ఆకాంక్షించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+