నాతో పెట్టుకోవద్దు, సీఎం పళనిసామికి వార్నింగ్ ఇచ్చిన శశికళ అక్క కొడుకు, పదవిలో ఉండవు !
అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తనను తొలగించడానికి ఎవ్వరికీ అర్హత లేదని టీటీవీ దినకరన్ అన్నారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తనను తొలగించడానికి ఎవ్వరికీ అర్హత లేదని టీటీవీ దినకరన్ అన్నారు. అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి టీటీవీ దినకరన్ ను తొలగిస్తూ తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి గురువారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
గురువారం మద్యాహ్నం ఈ విషయంపై చెన్నైలో టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడారు. అసలు నన్ను పదవి నుంచి తప్పించడానికి వాళ్లు ఎవరు? అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పలువురు మంత్రుల మీద మండిపడ్డారు.

అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) మీద సర్వాధికారాలు తనకు మాత్రమే ఉన్నాయని టీటీవీ దినకరన్ చెప్పారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్థిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటానని, సీఎం ఎడప్పాడి పళనిసామి అయినా సరే చర్యలు తప్పవని, ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తానని టీటీవీ దినకరన్ హెచ్చరించారు.
శశికళ తనను అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ఉప కార్యదర్శిగా నియమించారని టీటీవీ దినకరన్ గుర్తు చేశారు. సీఎంతో సహ అందరూ కలిసి టీటీవీ దినకరన్ ను మెడపట్టి బయటకు గెంటేసినా ఆయన ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నారో అర్థం కాక అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications