సెక్స్ రాకెట్‌లో 62 మంది అరెస్ట్: యువతులు, 'మాజీ' కొడుకు అరెస్ట్
ఢిల్లీ: హర్యానా రాష్ట్ర పోలీసులు మంగళవారం రాత్రి సెక్స్ రాకెట్, జూదం రాకెట్‌ను రట్టు చేశారు. ఇందుకు సంబంధంచి 62 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఐదుగురు మహిళలు ఉన్నారు. మాజీ ప్రజాప్రతినిధి కొడుకు కూడా అందులో ఒకరు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ రాకెట్‌ను పోలీసులు సోనిపాట్ జిల్లాలోని ఓ ఫాంహౌజ్‌లో రట్టు చేశారు. వారి నుండి పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్ననట్లు చెప్పారు.

పోలీసుల అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. తాము వారి నుండి ఐదు లక్షల ఎనబై వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సదరు ఫాం హౌస్ పైన రెయిడ్ చేశారన్నారు.
నిందితులు వివిధ గదుల్లో పట్టుబడ్డారని చెప్పారు. సోనిపట్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. నిందితులందరినీ న్యాయస్థానంలో ప్రవేశ పెడతామని చెప్పారు.












Click it and Unblock the Notifications