సెక్స్ రాకెట్ గుట్టు రట్టు, 55 ఏళ్ల మహిళ అరెస్ట్
నాగపూర్: శనివారం మధ్యాహ్నం సోషల్ సర్వీస్ బ్రాంచ్ ఓ సెక్స్ రాకెట్ గట్టును రట్టు చేశారు. మహారాష్ట్ర నాగపూర్‌లోని ఓ ప్రాంతంలోని నివాసాల మధ్య సెక్స్ రాకెట్ విషయం తెలుసుకున్న ఎస్ఎస్‌బీ టీం దాడులు నిర్వహించి రట్టు చేసింది. ఈ ఘటనలో 55 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు.
ఎస్ఎస్‌బీ టీం అతనిని అరెస్టు చేసి గిట్టిఖదన్ పోలీసులకు అప్పగించారు. ఆమె పైన పలు సెక్షన్లతో పాటు పిటా కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

నివాస సముదాయంలోని ఇంట్లో వ్యభిచారం జరుగుతున్న విషయం తెలియడంతో పోలీసు ఇన్స్‌పెక్టర్ బీఎం పోవార్ నేతృత్వంలోని ఓ టీం దాడులు చేసింది. ఈ దాడిలో పోలీసులు ఓ యువతిని రక్షించారు. ఆమెను రెస్క్యూ హోంకు తరలించారు. కాగా, వ్యభిచార గృహం నడుపుతున్న మహిళ భర్త మృతి చెందాడు. ఆమె తనయుడు వేరుగా ఉంటున్నాడు.












Click it and Unblock the Notifications