గర్ల్స్‌ను బెదిరించి సెక్స్! చెన్నైలో హైదరాబాదీల అరెస్ట్
చెన్నై: యువతులను బెదిరించి చెన్నై కేంద్రంగా వారితో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు హైదరాబాదుకు చెందిన దళారులను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు హైదరాబాదీయులతో పాటు మొత్తం ఆరుగురు దళారులను అరెస్టు చేశారు. వీరి నుండి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు యువతులను రక్షించారు.
వారితో పాటు మరో నలుగిరికి పోలీసులు విముక్తి కల్పించారు. తమిళనాడులోని అళ్వారుతిరునగర్ ఇందిరాగాంధీ రోడ్డులోని ఓ అపార్టుమెంటులో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీనిని నిర్ధారించుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ రైడ్‌లో హైదరాబాదుకు చెందిన మనోజ్, మహ్మద్ జాఫర్, మస్తాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. థౌజంట్ లైట్లోని ఓ వసతి గృహంలో దాడులు నిర్వహించిన పోలీసులు మరో దళారిని అరెస్టు చేశారు.
ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు, ముంబై, కోల్‌కతకు చెందిన నలుగురు యువతులను వారి నుండి రక్షించారు. ఈ సందర్భంగా ోపలీసులు మాట్లాడుతూ... మనోజ్, మహమ్మద్ జాఫర్, మస్తాన్ రెడ్డిలు గతంలోనే వ్యభిచార దళారులుగా వ్యవహరిస్తూ పోలీసులకు చిక్కారని, వారిపై గతంలోను కేసులు నమోదయి ఉన్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications