సెక్స్ రాకెట్ షాక్: అమ్మాయిల్ని అమ్మి రూ.100 కోట్లు సంపాదించిన జంట
ఢిల్లీ: అమ్మాయిల అక్రమ రవాణా, సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఓ జంటతో పాటు మరో ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఎనిమిది మంది పైన పోలీసులు మోకా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ రాకెట్ కీలక సూత్రదారులు హుస్సేన్, సైరాలుగా పోలీసులు గుర్తించారు.
ఏపీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్నాటక, అసోం తదితర రాష్ట్రాలతో పాటు నేపాల్ నుంచి దాదాపు ఐదు వేల మంది అమ్మాయిలను వీరిద్దరు ఢిల్లీకి అక్రమంగా తరలించేవాళ్లు. రూ.50వేలకు అమ్మాయిని కొనడం, రూ.2 లక్షలు అంతకు పైగా అమ్మేయడం చేసేవారు. వీరు కూడా రాకెట్ నడిపేవారు.

ఈ వ్యాపారంతో వీరు ఇప్పటి దాకా రూ.100 కోట్లు ఆర్జించినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అమ్మాయి వయస్సు ఎంత తక్కువగా ఉండే వీళ్లకు అంత ఎక్కువ డబ్బులు వచ్చేవని తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
కొందరు అమ్మాయిలను తీసుకు వచ్చి మేనేజర్లకు అమ్మేవారు. ఈ మేనేజర్లు, మరికొందరి ద్వారా సైరా భానుకు అమ్మాయిలను అమ్మేవారు.
వీరిని మెయింటెయిన్ చేసే బాధ్యతలను సైరా ఇంకొందరు అమ్మాయిలకు అప్పగించేది. అమ్మాయిలను అల్మరాల్లోనూ, షెల్ఫ్‌లలోను దాచి ఉంచేవారు. విటుల వద్దకు వారే పంపేవారు. ఎదురు తిరిగితే కఠినమైన శిక్షలు ఉండేవి. ఇలా వీరు వంద కోట్ల రూపాయలు సంపాదించడం గమనార్హం.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications