సెక్స్ రాకెట్ రట్టు: మహిళల అరెస్ట్, రోజుకు రూ.500 ఇచ్చి...
నాగపూర్: క్రైమ్ బ్రాంచ్ సోషల్ సర్వీసింగ్ వింగ్ సోమవారం నాడు వథోడాలోని పవనశక్తి నగర్ ప్రాంతంలో ఓ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేసిన క్రైం బ్రాంచ్ పోలీసులు, ఓ యువతిని వ్యభిచార కూపం నుండి కాపాడారు.
పోలీసులు రక్షించిన యువతి తండ్రికి పెరాలసిస్ అని చెబుతున్నారు. తండ్రికి పెరాలసిస్ రావడంతో కుటుంబ పోషణ కోసం కొందరి ద్వారా ఆమె పడుపు వృత్తిలోకి దిగింది. ఈ బిజినెస్‌లోకి వస్తే బాగా డబ్బులు వస్తాయని చెప్పి ఆమెను నిర్వాహకులు ఇందులోకి దింపారు.

అయితే, ఆమె చెప్పిన సమాచారాన్ని పోలీసులు వాస్తవమా లేదా అని తెలుసుకుంటున్నారు. ఈ సెక్స్ రాకెట్ కీలక నిందితులు రజ్నీ షాఖ్రే మహిళ అని గుర్తించారు. సాహిని అనే వ్యక్తి ఆమెకు తన ఇంటిలో ఓ గదిని ఇచ్చి ఆమెకు ప్రోత్సాహం ఇస్తున్నట్లుగా గుర్తించారు.
తన ఇంటిలోని ఓ గదిని ఆమెకు ఇందుకోసం కిరాయి ఇచ్చేందుకు అతను రూ.500 తీసుకుంటున్నాడు. దీంతో రజ్నీ యువతులను, క్లయింట్లను ఆ ఇంటికే తీసుకు వస్తోంది. పోలీసులు డెకాయ్ కస్టమర్‌ను పంపించి ఈ సెక్స్ రాకెట్‌ను రట్టు చేశారు.












Click it and Unblock the Notifications