సెక్స్ రాకెట్ రట్టు, ముగ్గురు యువతులు రెస్క్యూహోంకు
పాట్నా: నగర పోలీసులు గురువారం సాయంత్రం ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. గార్డానిబాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ వ్యభిచార ముఠాను రట్టు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార కూపం నుండి ముగ్గురు యువతులను పోలీసులు రక్షించారు. వారు ముగ్గురు కూడా 25 నుండి 30 ఏళ్ల వయస్సు మధ్య ఉన్నారు.
సంఘటన స్థలం నుండి కండోమ్స్, ఆక్సీటోజిన్ ఇంజెక్షన్స్, మూడు వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం అందగానే, తాము ఓ టీంను రైడ్‌కు పంపించినట్లు ఎస్ఎస్పీ జితేంద్ర తెలిపారు.

నగర పోలీసు ఎస్పీ శివదీప్ నేతృత్వంలో టీంను రైడ్‌కు పంపించినట్లు చెప్పారు. ముగ్గురు యువతులను రక్షించి, వారిని రెస్క్యూ హోంకు తరలించామని చెప్పారు. అరెస్టైన వారిలో ఒకరు రాకెటీర్, ఇద్దరు కస్టమర్లు ఉన్నట్లుగా చెప్పారు. అరెస్టైన వారిలో లాల్‌మతి, కస్టమర్లు షేక్, కృష్ణపాద్‌లు ఉన్నారు. వారిద్దరు కూడా పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారిగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications