మంత్రి సెక్స్ స్కాండల్: ఆ మహిళ చెప్పింది వింటే షాక్!

సీడీలో ఉన్నది తాను కాదని, మేటి తనకు తండ్రి సమానుడని చెప్పి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.

బెంగుళూరు: నగరసభ కార్యాలయంలో రాసలీలకు తెరలేపి అడ్డంగా బుక్కయిపోయిన కర్ణాటక ఎక్సైజ్ శాఖా మంత్రి హెచ్. వై. మేటి తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు ఆయన రాసలీలల బాగోతమంతా కన్నడ టీవీ చానెళ్లలో ప్రసారమైంది.

ఆ క్లిప్పింగ్స్ లో ఉన్నది మేటినే అన్న సంగతి స్పష్టంగా కనిపించింది. 30సెకన్ల నిడివి గల ఈ వీడియోలో మేటితో శృంగార కార్యకలాపాలు సాగించిన మహిళ ముఖాన్ని మాత్రం మీడియా కవర్ చేసినట్టుగా తెలుస్తోంది. కాగా, ఇప్పుడా మహిళ కనిపించకుండా పోవడం ఈ కేసులో మరింత ఉత్కంఠను రేపుతోంది.

వీడియో సీడీలు బయటకు వచ్చిన అనంతరం బాగల్కోటె జిల్లా ఎస్పీ ఎ.ఎన్.నాగరాజ్‌ను కలసి తనను కొందరు బెదరిస్తున్నారని రక్షణ కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. దీంతో పోలీసులు ఆమెకు రక్షణ కల్పించారు. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటూ ఆసుపత్రిలో చేరింది.

sex scandal cd, woman was missed who involved in sex with karnataka minister meti

బుధవారం రాత్రి ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయింది. ఇక అప్పటినుంచి ఆమె ఆచూకీ లభించకపోవడం, ఎక్కడకు వెళ్లి ఉంటుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో.. ప్రస్తుతం ఆమె మిస్సింగ్ మిస్టరీగా మారింది.

తొలుత బుకాయించినా..

మంత్రితో శృంగార రాసలీలలు సీడీలు టీవీ చానెళ్లలో ప్రసారమవడంతో.. అందులో ఉన్నది తాను కాదని తొలుత బుకాయించే ప్రయత్నం చేసింది. సీడీలో ఉన్నది తాను కాదని, మేటి తనకు తండ్రి సమానుడని చెప్పి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+