Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pollachi: సెక్స్ స్కాండిల్ కేసులో ఒక్కడిని వదలం, మా నాన్న సీఎం అయితే ?, హీరో శపథం !

చెన్నై/పొల్లాచ్చి: మా నాన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంతకాలం సెక్స్ స్కామ్ లో అన్యాయం జరిగిన మహిళలు అందరికి న్యాయం జరిగేలా చూస్తామని, ఈ కేసులో ఎవ్వరిని వదిలపెట్టమని ఇటీవల ఎమ్మెల్యే అయిన యువ హీరో శపథం చేశారు. మా నాన్న స్టాలిన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పొల్లాచ్చి సెక్స్ స్కామ్ కేసు మళ్లీ తెరమీదకు వస్తుందని, ఈ కేసులో ఒక్కడిని వదలమని యువ హీరో ఉదయానిధి స్టాలిన్ బహిరంగంగా హామీ ఇవ్వడంతో ఇంతకాలం ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రంలో అనేక మంది అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడి జైలు పాలైన వాళ్లు హడలిపోతున్నాయి. ఇదే సమయంలో పొల్లాచ్చి సెక్స్ స్కామ్ లో తప్పించుకుని బయట తిరుగుతున్న వారి గుండెళ్లో ఎక్స్ ప్రెస్ రైళ్లు పరిగెడుతున్నాయి.

 రేపే సీఎంగా ప్రమాణస్వీకారం

రేపే సీఎంగా ప్రమాణస్వీకారం

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే, స్టాలిన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. డీఎంకే పార్టీ అధినేత ఎంకే. స్టాలిన్ ముద్దుల కొడుకు, యువ హీరో, డీఎంకే పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయానిధి స్టాలిన్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలోని చెపాక్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు.

 కరుణానిధికి అంకితం

కరుణానిధికి అంకితం

చెన్నైలోని సొంత నియోజక వర్గంలో పర్యటించిన ఉదయానిధి స్టాలిన్ స్థానిక ప్రజలను కలిసిశారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన చెపాక్ నియోజక వర్గం ప్రజలకు ఉదయానిధి స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కట్టపెట్టిన భారీ మెజారిటీని తన తాతగారు మాజీ సీఎం కరుణానిధికి, సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్న పార్టీ అధినేత ఎంకే. స్టాలిన్ కు అంకితం ఇస్తున్నానని ఉదయానిధి స్టాలిన్ అన్నారు.

 ఒక్కడిని వదిలిపెట్టం

ఒక్కడిని వదిలిపెట్టం

ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన పొల్లాచ్చిలో ఇటీవల కలకం రేపిన లైంగిక వేధింపుల కేసులో నిందితులు ఎవ్వరిని వదిలపెట్టమని ఉదయానిధి స్టాలిన్ అన్నారు. తన తండ్రి ఎంకే, స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పొల్లాచ్చి సెక్స్ స్కామ్ లోని నిందితులు అందరికి చట్టపరంగా కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని ఉదయానిధి స్టాలిన్ బాధితులకు ఈ సందర్బంగా బహిరంగంగా హామీ ఇచ్చారు.

వివాహిత మహిళలు, కాలేజ్ అమ్మాయిలు టార్గెట్

వివాహిత మహిళలు, కాలేజ్ అమ్మాయిలు టార్గెట్

తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన పొల్లాచ్చిలో ఇటీవల కాలేజ్ లో చదువుకుంటూ ఏకాంతంగా గడపడానికి వెళ్లిన ప్రేమికులను బెదిరించి అమ్మాయిలపై అత్యాచారాలు జరిగాయి. కాలేజ్ అమ్మాయిలతో పాటు అమ్మాయిలు, వివాహిత మహిళల మీద పొల్లాచ్చిలో అనేక అత్యాచారాలు జరిగాయని వెలుగు చూడటంతో స్థానికులు, ప్రేమికులు హడలిపోయారు.

 సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

కాలేజ్ అమ్మాయిలు, యువతులు, వివాహిత మహిళలపై సామూహిక అత్యాచారం చేసే సమయంలో కొందరు వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. అన్నా మమ్మల్ని వదిలేయండి, ఇక ముందు ఇటువైపురాము అంటూ ఆ యువతులు వేడుకుంటున్న ఆడియో టేపులు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వైరల్ అయ్యాయి.

 ఆరోజు అధికారంలో..... ఈ రోజు ?

ఆరోజు అధికారంలో..... ఈ రోజు ?

తమిళనాడులో ఇన్ని రోజులు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే నాయకులకు రేప్ కేసులతో సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. పొల్లాచ్చి రేప్ కేసుల విచారణ ఇప్పటికే సీబీఐ చేతికి వెళ్లి పోయింది. పొల్లాచ్చి రేప్ కేసుల్లో అన్నాడీఎంకే పార్టీ విద్యార్థి విభాగం కార్యదర్శి అరుణాచలం, షేక్ బాబు, హెరాన్ పాల్ తో పాటు మరో ముగ్గురిని సీబీఐ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. నలుగురు రేప్ కేసు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి సీబీఐ అధికారుల ముందు సాక్షం చెప్పడంతో శబరిరాజ్, సతీష్, వసంతకుమార్, తిరునావక్కరసు, మణివన్నన్ తో సహ మొత్తం 8 మందిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి వాళ్లను జైల్లో పెట్టారు.

 రేప్ లు చేసి బ్లాక్ మెయిల్ ?

రేప్ లు చేసి బ్లాక్ మెయిల్ ?

పొల్లాచ్చిలో కాలేజ్ అమ్మాయిలు, ప్రేమికులను బెదిరించి ప్రియురాళ్లను, వివాహిత మహిళలపై గ్యాంగ్ రేప్ లు చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. తమకు జరిగిన అన్యాయం గురించి నలుగురు బాధితులు సీబీఐ అధికారుల ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు. కోయంబత్తూరు మహిళా కోర్టులో మరో యువతి రహ్యసంగా తన మీద రేప్ చేసిన వారి అనావళ్లతో పాటు కొందరి పేర్లు చెప్పి స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ కేసును సీబీఐ అధికారులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.

 ప్రభుత్వం మారిపోవడంతో తడిసిపోయింది

ప్రభుత్వం మారిపోవడంతో తడిసిపోయింది

ఇంతకాలం తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు కొందరిని వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కాబోతున్న ఎంకే. స్టాలిక్ కొడుకు, ఆ పార్టీ ఎమ్మెల్యే ఉదయానిధి స్టాలిన్ పొల్లాచ్చి సెక్స్ స్కామ్ కేసు విషయం మాట్లాడటంతో అన్నాడీఎంకే పార్టీలోని కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+