వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో సంచలనం సృష్టించిన రాజకీయ నాయకుల సెక్స్ స్కాండల్స్..

సెక్స్ స్కాండల్స్ లో ఇరుక్కుని మంత్రి పదవులను కోల్పోయిన నాయకులు, దేశంలో చాలామందే ఉన్నారు. అందులో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొన్ని సంఘటనల వివరాలు..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ నాయకులు రాసలీలల బాగోతాల్లో పట్టబడుతున్న సంఘటనలు ఈమధ్య కాలంలో చాలానే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కర్ణాటక ఎక్సైజ్ మంత్రి హెవై మేటీ సాగించిన రాసలీలల వ్యవహారం వార్తల్లో నానుతూనే ఉంది. మొత్తానికి వివాదం కాస్త మంత్రి రాజీనామా దాకా వెళ్లిన సంగతి తెలిసిందే.

ఈ విషయం వెలుగుచూడటానికి కొద్దిరోజుల ముందు మరో కర్ణాటక మంత్రి తన్వీర్ సైత్ సైతం అశ్లీల వీడియోల ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి తన్వీర్.. పబ్లిక్ గానే అశ్లీల వీడియోలు వీక్షించారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే పార్టీ కూడా అతన్ని వెనకేసుకు రావడంతో.. ఆయనపై ఎలాంటి వేటు పడలేదు.

ఒక్క కర్ణాటక మంత్రి హెచ్.వై మేటి మాత్రమే కాదు.. రాసలీలలు సాగిస్తూ పట్టుబడిన రాజకీయ నాయకులు గతంలోను, ఇప్పుడూ దేశంలో చాలామందే ఉన్నారు. అందులో మచ్చుకు కొన్ని సంఘటనలు పరిశీలిద్దాం.

Sex and the politicians- Top scandals that rocked India

బాబులాల్ నగర్:

రాజస్థాన్ కు చెందిన మాజీ మంత్రి బాబులాల్ గతంలో సెక్స్ స్కాండల్ ఆరోపణల్లో ఇరుక్కున్నారు. ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశజూపి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. బాధిత మహిళ మంత్రిపై ఆరోపణలు చేయడంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయలేక తప్పదు.

రాఘవ్ జీ లఖంసీ సవాలా:

మధ్యప్రదేశ్ కు చెందిన రాఘవ్ జీ లఖంసీ సవాలా తన వద్ద పనిచేసే ఓ మహిళను లైంగికంగా వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమెను లైంగికంగా వేధించడన్న ఆరోపణలు తీవ్రతరం కావడంతో చివరికి మంత్రి పదవికి రాజీనామా చేయలేక తప్పలేదు.

గోపాల్ కందా:

హర్యానాకు చెందిన గోపాల్ కందా తాను మంత్రిగా ఉన్న సమయంలో ఓ ఎయిర్ హోస్టెస్ ను తీవ్ర లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్ లో మంత్రి పేరును పేర్కొనడంతో.. గోపాల్ కందా కటకటాల్లోకి వెళ్లారు. ఆపై ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటపడ్డాడు.

ఎన్డీ తివారీ:

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ఎన్డీ తివారీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేస్తున్న సమయంలో సెక్స్ స్కాండల్ లో పట్టుబడ్డారు. ఓ టీవి చానెల్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ లో రాసలీలలు సాగిస్తున్న ఎన్డీ తివారీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో ఆయనపపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.

మహిపాల్ మదెర్నా:

భన్వరీ దేవితో సెక్స్ స్కాండల్ లో ఇరుక్కుని మహిపాల్ మదెర్నా రాజస్తాన్ కేబినెట్ లో మంత్రిపదవిని కోల్పోయారు. 2011లో ఈ ఘటన జరగ్గా.. భన్వరీ దేవి మిస్సయిందని, మంత్రి మహిపాల్ ఆమెను కిడ్నాప్ చేశారని ఆరోపణలు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే భన్వరీ దేవి, ఆమె భర్త ఇద్దరు కలిసి మంత్రి మహిపాల్ ను డబ్బుల కోసం డిమాండ్ చేయడం.. ఆయన అందుకు నిరాకరించడంతో.. మహిపాల్ సెక్స్ స్కాండల్ వీడియోను బహిర్గతం చేస్తామని హెచ్చరించడంతో.. విషయం కాస్త రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీంతో మంత్రి పదవి నుంచి ఆయనకు ఉద్వాసన తప్పలేదు.

అమర్మణి త్రిపాఠి:

కవి మధుస్మిత శుక్లాతో ప్రేమాయణం సాగించిన అమర్మణి త్రిపాఠి.. ఆమె గర్భవతిగా మారడంతో అబార్షన్ చేయించుకోవాల్సిందిగా బెదిరింపులకు దిగాడు. ఇందుకు మధుస్మిత శుక్లా ఒప్పుకోకపోవడంతో త్రిపాఠి ఆమెను గన్ తో కాల్చేశాడు. దీంతో మాయావతి ప్రభుత్వం నుంచి ఉద్వాసనకు గురై జైలుకు వెళ్లాడు.

పీకె కున్హాలికుట్టి:

1997లో కోజికోడ్‌లోని ఓ ఐస్ క్రీమ్ పార్లర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలతో కేరళ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న పీకె కున్హాలికుట్టి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే కేసులో ఎక్కడా ఆయనపై ఆరోపణలు లేకపోవడం గమనార్హం.

సురేశ్ రామ్:

జగ్జీవన్ రామ్ కుమారుడు సురేశ్ రామ్ 1978లో సెక్స్ స్కాండల్ లో పట్టుబడ్డాడు. ఓ మహిళతో అసభ్యకర రీతిలో పట్టుబడ్డ ఫోటోలు సూర్య మేగజైన్ లో ప్రచురితమవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

English summary
What is it with politicians and sex scandals? On Wednesday the country woke up to another sex scandal from Karnataka, allegedly involving Excise Minister H Y Meti. He was forced to resign, after an obscene video of his did the rounds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X