'బిజెపి ఎంఏల్ఏ సెక్స్ వీడియో, ఆ వీడియోలో ఉంది నేను కాదు'
అసోం రాష్ట్రంలోని బిజెపి ఎంఏల్ఏలకు కొత్త చిక్కులొచ్చాయి. ఆ ఎంఏల్ఏ హోటల్ రూమ్ లో ఓ మహిళతో లైంగిక చర్యలకు పాల్పడుతున్న వీడియో అసోం రాష్ట్రంలో హల్ చల్ చేస్తోంది.
అసోం: అసోం రాష్ట్రంలోని బిజెపి ఎంఏల్ఏలకు కొత్త చిక్కులొచ్చాయి. ఆ ఎంఏల్ఏ హోటల్ రూమ్ లో ఓ మహిళతో లైంగిక చర్యలకు పాల్పడుతున్న వీడియో ఒకటి అసోం అంతటా హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఉన్నది తాను కాదని ఆయన చెబుతున్నారు. పార్టీలోని గిట్టని వాళ్ళే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అసోం రాష్ట్రంలోని మోరిగావ్ నియోజకవర్గం నుండి బిజెపికి చెందిన రమాకాంత్ ద్యూరీ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడు ఓ మహిళతో ఓ హోటల్ లో లైంగిక కార్యకలాపాల్లో ఉన్నట్టుగా...ఆమెను కాంప్రమైజ్ చేస్తున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి శనివారం నాడు బయటకు వచ్చింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై బిజెపి కన్నెర్ర చేసింది. అయితే అసలు ఈ వీడియోలో ఉంది తాను కాదన్నారు.త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో తనకు ఎక్కడ మంత్రి పదవి వస్తోందనే ఉద్దేశ్యంతోనే ప్రత్యర్థులు కుట్రపన్నారని ఆయన ఆరోపించారు.
వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి వాస్తవాలు తేల్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నివేదిక తనకు వ్యతిరేకంగా వస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు.అంతేకాదు రాజకీయాల్లో నుండి తప్పుకొంటానని ఆయన స్పష్టం చేశారు.