• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Net cafe blackmail: ఆంటీకి క్రీమ్ బిస్కెట్, నగ్న వీడియోలతో జస్ట్ రూ. 10 లక్షలు, అత్యాశ లేదు !

|

చెన్నై/ రామనాథపురం: మొబైల్ రీచార్జ్ చేసుకోవడానికి Net cafeకు వచ్చి వెలుతున్న ఆంటీకి ఇటర్నెంట్ కేఫ్ షాప్ లోని వ్యక్తులు క్రీమ్ బిస్కెట్ వేశారు. అసలే విడాకులు తీసుకున్న మహిళ ఇంటర్నెట్ కేఫ్ వ్యక్తులు ఆంటీతో పరిచయం పెంచుకుని సన్నిహితంగా దగ్గర అయ్యారు. నిన్నేప్రేమిస్తున్నా, పెళ్లిచేసుకుందాంరా అంటూ ఆ షాప్ లోని ఓ వ్యక్తి మాయమాటలు చెప్పాడు. అంతే కథ బెడ్ రూం వరకు వెళ్లింది. ఆ సమయంలో ఆంటీ రాసలీలలు సాగిస్తున్న సమయంలో ఆ వ్యక్తి ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు తీశాడు. తరువాత తనకు జస్ట్ రూ. 10 లక్షలు ఇస్తే చాలని, తనకు అత్యాశ లేదని, లేదంటే నీ నగ్న వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్ లో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేశాడు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన మహిళ నగ్న వీడియోలు, ఫోటోలను స్నేహితులతో పాటు విదేశాల్లో ఉన్న ఫ్రెండ్స్ కు షేర్ చెయ్యడంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్

 విడాకులు తీసుకున్న ఆంటీ

విడాకులు తీసుకున్న ఆంటీ

తమిళనాడులోని రామనాథపురం జిల్లా ఏర్వాడిలో నివాసం ఉంటున్న 45 ఏళ్ల మహిళ, ఆమె భర్త నివాసం ఉంటున్నారు. నిత్యం ఆంటీ భర్తతో గొడవలు పడటంతో విభేదాలు వచ్చాయి. వీరి గొడవలు తారాస్థాయికి చేరాయి. తరువాత పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి ఆంటీ భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా నివాసం ఉంటున్నది.

 ఇంటర్నెట్ కేఫ్ సోదరులు

ఇంటర్నెట్ కేఫ్ సోదరులు

ఏర్వాడి ప్రాంతంలోనే నివాసం ఉంటున్న షాదుషా (35), హాజీ (32) అనే సోదరులు ఇంటర్నెట్ కేఫ్ తో పాటు మొబైల్ షోరూం, మొబైల్ కరెన్సీ రీచార్జ్ షాపు నిర్వహిస్తున్నారు. ఇదే ఇంటర్నెట్ కేఫ్ లో సహాబుద్దీన్ (40) అనే వ్యక్తి పని చేస్తున్నాడు. మొబైల్ రీచార్జ్ చేసుకోవడానికి ఆంటీ వీరి షాపుకు వచ్చి వెలుతున్నది.

 ఆంటీకి క్రీమ్ బిస్కెట్

ఆంటీకి క్రీమ్ బిస్కెట్

మొబైల్ రీచార్జ్ చేసుకోవడానికి వచ్చి వెలుతున్న ఆంటీతో ఇంటర్నెట్ కేఫ్ యజమానులు హాజీ, షాదుషా పరిచయం పెంచుకుని ఆమెకు క్రీమ్ బిస్కెట్ వేశారు. ఆంటీ చూడటానికి ఎర్రగా బుర్రగా బలంగా ఉండటంతో ఆమెకు సోదరులు ఒకరికి తెలీకుండా ఒకరు లైన్ లో పెట్టారు. ఇదే సమయంలో ఆంటీ దగ్గర ఆస్తి, డబ్బులు ఎక్కువగా ఉందని షాదుషా, హాజీ పసిగట్టారు.

 నేనేమైనా తక్కువ తిన్నానా !

నేనేమైనా తక్కువ తిన్నానా !

ఆంటీతో ఇంటర్నెట్ కేఫ్ యజమానులు షాదుషా, హాజీ ఒకరికి తెలీకుండా ఒకరు ఆమెతో రాసలీలలు సాగించి కొంత మొత్తంలో నగదు లాక్కొని ఆమెను వాడుకుని వదిలేశారు. ఇదే సమయంలో వారి షాప్ లో పని చేస్తున్న సహాబుద్దీన్ నేనేమైనా తక్కువ తిన్నానా ? అంటూ ఆంటీకి గాలం వేశాడు. మా షాపు యజమానులు నిన్ను మోసం చేసినట్లు నేను మోసం చెయ్యనని, నిన్ను వివాహం చేసుకుని నీకు మరోజన్మ ఇస్తానని, నీకు స్వర్గం చూపిస్తానని, జీవితాంతం తోడు ఉంటానని ఆమెకు మాయమాటలు చెప్పాడు.

 ఓకే....ఆటాడుకుందాం రా !

ఓకే....ఆటాడుకుందాం రా !

సహాబుద్దీన్ మాయమాటలు నమ్మిన ఆంటీ అతనికి దాసోహం అయ్యింది. పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో అతను పిలిచినచోటకు వెళ్లింది. రాత్రిపూట గట్టుచప్పుడు కాకుండా ఆమె ఇంటికే సహాబుద్దీన్ ను పిలుపించుకుని రాసలీలలు సాగించింది. ఆంటీతో రాసలీలలు సాగించే సమయంలో రహస్యంగా ఆమెకు తెలీకుండా ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు తీసిన సహాబుద్దీన్ వాటిని మొబైల్ లో చూసుకుంటూ కొన్ని రోజులు కాలం గడిపాడు.

 నాకు అత్యాశ లేదు, జస్ట్ రూ. 10 లక్షలు చాలు

నాకు అత్యాశ లేదు, జస్ట్ రూ. 10 లక్షలు చాలు

రెండు నెలల నుంచి ఇంటర్నెట్ కేఫ్ కు వెళ్లి వస్తున్న ఆంటీ తనను పెళ్లి చేసుకోవాలని సహాబుద్దీన్ మీద ఒత్తిడి చేసింది. తరువాత అసలు స్వరూపం చూపించిన సహాబుద్దీన్ మొబైల్ లోని ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు చూపించి తనకు అత్యాశ లేదని, కేవలం రూ. 10 లక్షలు ఇస్తే చాలని, లేదంటే నీ నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా ఎంజాయ్ చేసిన సహాబుద్దీన్ నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఆమె షాక్ కు గురైయ్యింది. చచ్చినా నీకు రూ. 10 లక్షలు ఇవ్వనని ఆంటీ తేల్చిచెప్పింది.

 ఫ్రీ ఇంటర్నెట్ అని విదేశాలకు షేర్ చేశారు

ఫ్రీ ఇంటర్నెట్ అని విదేశాలకు షేర్ చేశారు

డబ్బులు ఇవ్వడానికి ఆంటీ నిరాకరించడంతో ఇక లాభం లేదని తెలుసుకున్న సహాబుద్దీన్ ఇంటర్నెట్ కేఫ్ యజమానులు షాదుషా, హాజీలకు ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు చూపించారు. డబ్బులు ఇవ్వకపోతే పోనీ, మన ఫ్రెండ్స్ ఈ వీడియోలు చూసి ఎంజాయ్ చేస్తారులే అంటూ వాటిని తమిళనాడు, విదేశాల్లో ఉన్న స్నేహితులకు ముగ్గురు కలిసి షేర్ చేశారు.

 నీకేం పోయోకాలం వచ్చింది

నీకేం పోయోకాలం వచ్చింది

ఆంటీ నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి చివరి ఆమె సమీప బంధువు కంట్లో పడ్డాయి. నీకేం పోయోకాలం వచ్చింది ఇలా చేశావు అంటూ బంధువు ఆంటీకి చివాట్లు పెట్టాడు. ఆందోళన చెందిన ఆంటీ రామనాథపురం జిల్లా ఎస్పీ వరుణ్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేసింది. ఎస్పీ వరుణ్ కుమార్ ఆదేశాలతో కేసు నమోదు చేసిన ఏర్వాడి పోలీసులు మహిళ జీవితంతో చెలగాటం ఆడిని ఇంటర్నెట్ కేఫ్ యజమానులు షాదుషా, హాజీ, మహిళను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నగ్న వీడియోలు తీసిన సహాబుద్దీన్ లను అరెస్టు చేసి బెండ్ తీశారు. కామాంధుల దగ్గర ఉన్న నాలుగు మొబైల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నామని, వీరు ఇంకా ఎంత మంది మహిళల జీవితాలతో ఇలా చెలగాటం ఆడారు ఆని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Sex Videos blackmail: Ramanathapuram Net Cafe owners arrested for Sexual Harassment in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more