Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మేజర్ అయిన యువతి ఒప్పుకుంటే సెక్స్ చెయ్యటం నేరం కాదు; కానీ అనైతికం: అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఒక యువతిపై సామూహిక అత్యాచారం కేసులో,బెయిల్ కోసం అభ్యర్థించిన యువతి బాయ్ ఫ్రెండ్ కు బెయిలు నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు ఈ కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.యువతి మేజర్ అని, తామిద్దరం ఏకాభిప్రాయంతోనే సెక్స్ లో పాల్గొన్నామని, అయితే యువతిపై సామూహిక అత్యాచారం చేసిన మిగతా వారితో తనకు సంబంధం లేదని,తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరిన పిటిషనర్ పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది.

 గ్యాంగ్‌రేప్ నిందితుడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు

గ్యాంగ్‌రేప్ నిందితుడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు

మేజర్ అయిన యువతితో ఏకాభిప్రాయం మేరకు సెక్స్ చేయడం నేరం కాదని, కానీ ఆ యువతి పై సామూహిక అత్యాచారం జరుగుతున్నా అడ్డుకోకపోవడం అనైతికం అంటూ గ్యాంగ్‌రేప్ నిందితుల బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. గ్యాంగ్‌రేప్ నిందితుడి బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టులోని సింగిల్ బెంచ్ శనివారం తిరస్కరించింది. మేజర్ అయిన యువతి సమ్మతితో సెక్స్ చేయడం నేరం కాదని, అయితే ఇది అనైతికం అని భారతీయ సమాజంలో స్థిరపడిన సామాజిక నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.

యువతి బాయ్ ఫ్రెండ్ బెయిల్ పిటీషన్ కొట్టేసిన కోర్టు కీలక వ్యాఖ్యలు

యువతి బాయ్ ఫ్రెండ్ బెయిల్ పిటీషన్ కొట్టేసిన కోర్టు కీలక వ్యాఖ్యలు

ఈ కేసులో నలుగురు నిందితుల్లో ఒకరి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు, యువతికి బాయ్‌ఫ్రెండ్ అని చెప్పుకునే పిటిషనర్, ఇతర సహ నిందితులచే లైంగికంగా వేధింపులకు గురవుతున్నప్పుడు ఆమెను రక్షించడం బాయ్యొ ఫ్రెండ్ గా అతని కర్తవ్యమని పేర్కొంది. బాధితురాలు నిందితుడైన పిటిషనర్‌కు స్నేహితురాలు అయితే, ఆ క్షణంలోనే ఆమె గౌరవం, ప్రతిష్టను కాపాడటం అతని బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది. మేజర్ అయిన యువతితో సెక్స్ చేయడం నేరం కాదని, కానీ ఆమెపై సామూహిక అత్యాచారం జరుగుతున్నా అడ్డుకోక పోవడం బాయ్ ఫ్రెండ్ తప్పని వ్యాఖ్యానించింది.

ప్రియురాలిపై గ్యాంగ్ రేప్ జరుగుతుంటే మౌనంగా ఉంటావా ? బాయ్ ఫ్రెండ్ గా అర్హుడివి కాదు

ప్రియురాలిపై గ్యాంగ్ రేప్ జరుగుతుంటే మౌనంగా ఉంటావా ? బాయ్ ఫ్రెండ్ గా అర్హుడివి కాదు

సంఘటన జరిగిన సమయంలో పిటిషనర్ ప్రవర్తన ఖండించదగినది అని పేర్కొన్న కోర్టు అతడిని బాయ్ ఫ్రెండ్ అని పిలవడానికి అర్హుడు కాదు అంటూ వ్యాఖ్యానించింది. తన ఎదుటే ప్రియురాలిపై సామూహిక అత్యాచారం జరుగుతుండగా మౌనంగా చూస్తూ ఉండడాన్ని కోర్టు ప్రశ్నించింది. తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి యొక్క శరీరాన్ని, ఆమె మనసును కామాంధులు గాయం చేస్తుంటే, అతను అడ్డుకోలేక పోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. సామూహిక అత్యాచార నిందితులతో అతనికి సంబంధం లేదని చెప్పలేమని కోర్టు అభిప్రాయపడింది. అందుకే ఈ కేసులో పిటిషనర్ యొక్క బెయిల్ అభ్యర్ధనను కోర్టు నిరాకరించింది

మేజర్ అయిన యువతితో బాయ్ ఫ్రెండ్, కొట్టి గ్యాంగ్ రేప్ చేసిన మరో ముగ్గురు.. కేసు ఇదే

మేజర్ అయిన యువతితో బాయ్ ఫ్రెండ్, కొట్టి గ్యాంగ్ రేప్ చేసిన మరో ముగ్గురు.. కేసు ఇదే

నివేదికల ప్రకారం, ఫిబ్రవరి 19 న, కుట్టు కేంద్రంలో కుట్టు పని నేర్చుకోవడానికి వెళ్లిన మేజర్ అయిన ఓ యువతి తన ప్రియుడు రాజుకు ఫోన్ చేసి అతన్ని కలవాలని ప్లాన్ చేసింది. తరువాత, ఇద్దరూ ఒక నది ఒడ్డున కలుసుకున్నారు. కొంతసేపటికి మరో ముగ్గురు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. వారు రాజును కొట్టి అతని మొబైల్ ఫోన్ లాక్కున్నారు.

అనంతరం వారు బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సామూహిక అత్యాచారం కేసులో ఫిబ్రవరి 20, 2021న కౌశాంబిలోని అకిల్ సరాయ్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం మరియు ఇండియన్ పీనల్ కోడ్‌లోని సంబంధిత సెక్షన్ల కింద నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.

కేసును విచారిస్తున్న అలహాబాద్ హైకోర్టు దరఖాస్తుదారుకు బెయిల్ నిరాకరించింది. పిటిషనర్‌కు సహ నిందితులతో ఎటువంటి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పలేమని పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+