సెక్స్ వర్క్ ఒక ప్రొఫెషన్: సెక్స్ వర్కర్లను ఏ విధంగానూ వేధించొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: స్వచ్చంద వ్యభిచారం(కాన్సెంటింగ్ సెక్స్) నేరం కాదంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెక్స్ వర్కర్లను ఏ విధంగానూ వేధించరాదని, పోలీసులు, మీడియాను సుప్రీంకోర్టు ఆదేశించింది. సెక్స్ వర్కర్ల ఫొటోలను ప్రసారం చేయరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు, మీడియా సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సెక్స్ వర్కర్ల పట్ల అమర్యాదగా ప్రవర్తించొద్దు: సుప్రీంకోర్టు

సెక్స్ వర్కర్ల పట్ల అమర్యాదగా ప్రవర్తించొద్దు: సుప్రీంకోర్టు

వ్యభిచార గృహాలపై దాడులు జరిపిన సమయంలో పట్టుబడిన సెక్స్‌ వర్కర్ల ఫొటోలను ఎట్టిపరిస్థితుల్లోనూ మీడియా టెలిక్యాస్ట్ చేయరాదని సుప్రీం స్పష్టం చేసింది. అందరిలానే.. సెక్స్ వర్కర్లకు కూడా కనీస గౌరవ మర్యాదలు ఇవ్వాలని సూచించింది.సెక్స్ వర్కర్లపై భౌతికంగా గానీ, మాటలతో వేధించడం గానీ చేయరాదని స్పష్టం చేసింది.

సెక్స్ వర్కర్ల పట్ల పోలీసులు కనీస మర్యాదగా ఉండాలంటూ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఏ మీడియా లేదా పబ్లిషర్లు వారి ఫొటోలు ప్రచురించినా గుర్తింపును వెల్లడించినా ఐపీసీ 354C ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనికి సంబంధించి ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తగిన మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది.

స్వచ్చంద వ్యభిచారం నేరం కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు

స్వచ్చంద వ్యభిచారం నేరం కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఆర్టికల్‌ 142 ఆధారంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. సెక్స్‌ వర్కర్లకు సంబంధించి నియమించిన కమిటీ ఇచ్చిన కీలక సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించింది. సెక్స్ వర్కర్లకు సంబంధించి సిఫార్సులపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని సుప్రీం ఆదేశాల్లో పేర్కొంది.

సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సిఫార్సులను గమనించినట్లయితే..స్వచ్ఛంద వ్యభిచారం నేరం కానే కాదని సుప్రీం అభిప్రాయపడింది.వ్యభిచార గృహాలను నిర్వహించడం చట్ట విరుద్ధమని పేర్కొంది. అయితే, స్వచ్ఛందంగా వ్యభిచారం చేయడం మాత్రం నేరం కాదని తెలిపింది.వ్యభిచార గృహాలపై దాడుల సమయంలో స్వచ్ఛందంగా సెక్స్‌ వర్కర్లను అరెస్ట్‌ చేయాలి. కానీ, శిక్షించడం లేదా వేధించడం చేయరాదని స్పష్టం చేసింది.

సెక్స్ వర్కర్లకూ హక్కులంటాయన్న సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు

సెక్స్ వర్కర్లకూ హక్కులంటాయన్న సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు

ఏ సెక్స్‌ వర్కర్‌ అయినా లైంగికదాడికి గురైతే అందరిలానే వారికి సౌకర్యాలు కల్పించాలి. కనీస గౌరవం ఇవ్వాలి. సీఆర్పీసీ సెక్షన్‌ 357C ప్రకారం వారికి తక్షణ వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా అన్ని ఐటీపీఏ (ఇమ్మోరల్‌ ట్రాఫికింగ్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌) సంరక్షణ గృహాల్లోనే సర్వే నిర్వహించాలి. మహిళలను బలవంతంగా నిర్బంధించినట్లు రుజువైతే.. దానిపై సమీక్షించి నిర్దిష్ట గడువులోగా విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సెక్స్‌ వర్కర్ల పట్ల పోలీసుల వైఖరి క్రూరంగా, హింసాత్మకంగా ఉంటుందని అభిప్రాయపడింది. వారికీ హక్కులు ఉంటాయని గుర్తు చేసింది. ఈ విషయంలో పోలీసులు, ఇతర చట్టబద్ధ సంస్థలు సున్నితంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలి. మిగతా పౌరులులాగే సెక్స్ వర్కర్లకు రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కులున్నట్లు ఉన్నాయని తప్పక గుర్తించాలని సుప్రీంకోర్టు స్పషట్ం చేసింది. కొత్త ఐపీసీ 354సీ సెక్షన్‌ కింద ఇతరుల లైంగిక చర్యలను చూడటం నేరం.. ఈ సెక్షన్‌ను ఎలక్ట్రానిక్‌ మీడియాపై కఠినంగా అమలు చేయాలని పేర్కొంది.

రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో సెక్స్ వర్కర్లను వేధించొద్దు: సుప్రీం సూచనలు

రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో సెక్స్ వర్కర్లను వేధించొద్దు: సుప్రీం సూచనలు

రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో సెక్స్‌ వర్కర్లు, ఇతరుల ఫొటోలు, వివరాలు టెలిక్యాస్ట్ చేయడం నిషిద్ధమని సుప్రీం సూచించింది.సెక్స్‌ వర్కర్లు ఆరోగ్యం, భద్రత దృష్ట్యా కండోమ్‌ వంటివి దగ్గర దొరికినప్పుడు.. వాటి ఆధారంగా నేరంగా పరిగణించరాదు. సెక్స్‌ వర్కర్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ, రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థల ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలి.

హక్కులు, చట్టబద్ధత, పోలీసుల బాధ్యతలు, అధికారాలు, చట్టం ఎలాంటివి అనుమతిస్తోంది? వేటిని నిషేధిస్తోంది అనే విషయాలపై అవగాహన కల్పించాలి. హక్కుల కోసం అవసరమైతే న్యాయవ్యవస్థను ఎలా వినియోగించుకోవచ్చో తప్పకుండా చెప్పాలి. మానవ అక్రమ రవాణా చేసేవారి నుంచి, పోలీసుల చేతుల్లో వేధింపుల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో వివరించాలి. యూఐడీఏఐ జారీచేసే ప్రొఫార్మా సర్టిఫికెట్‌ను ఆధారంగా సెక్స్‌ వర్కర్లందరికీ ఆధార్‌కార్డు జారీచేయాలి.వారి వివరాలను నమోదు చేసే సమయంలో ఎక్కడా కూడా సెక్స్‌వర్కర్‌గా ప్రస్తావించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టాలను సంస్కరించేందుకు కేంద్రం, రాష్ట్రాలు సెక్స్ వర్కర్లు లేదా వారి ప్రతినిధులను తప్పనిసరిగా చేర్చుకోవాలని కోర్టు సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+