షాక్: పదో తరగతి బాలికపై రాజకీయ నేత లైంగికదాడి

బెంగళూరు: పరీక్షలు వ్రాయడానికి వెళుతున్న బాలిక మీద లైంగిక దాడి చేసిన గ్రామ పంచాయితీ సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని కోప్పళ తాలుకా నరసీపుర గ్రామపంచాయితీ సభ్యుడు అనిల్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కిమ్మన రత్నాకర్ తెలిపారు.

ఆదివారం మంత్రి కోప్పళ తాలుకాలోని నరసీపుర గ్రామం చేరుకుని షాక్ కు గురైన బాలికకు ధైర్యం చెప్పారు. 10వ తరగతి పరీక్షలు వ్రాసి పైచదువులకు వెళ్లాలని సూచించారు. తప్పు చేసిన నిందితుడు అనిల్ కుమార్ ను అరెస్టు చేశామని బాలికకు చెప్పారు.

Sexual assault against girl in Karntaka

ఇదే సమయంలో జిల్లా ఎస్పీ, జిల్లాధికారి, విద్యాశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. బాలిక, ఆమె కుటుంబ సభ్యులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని మంత్రి కిమ్మన రత్నాకర్ సూచించారు. బాలిక క్షేమంగా పరీక్షలకు వెళ్లి రావడానికి పోలీసులను నియమించారు.

గత శుక్రవారం బాలిక 10వ తరగతి పరిక్షలు వ్రాయడానికి వెళుతున్న సమయంలో గ్రామం శివార్లలో గ్రామ పంచాయితీ సభ్యుడు అనిల్ కుమార్ అడ్డగిచాడు. తరువాత కారులో బలవంతంగా తీసుకు వెళ్లి లైంగిక దాడికి గురి చేశాడు. ఆ సమయంలో బాలిక కారు డోర్ తీసి తప్పించుకుని వచ్చి కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+