నటిపై లైంగిక దాడి: యువనటుడి ఇంట్లో నిందితుడు

నటిపై లైంగిక వేధింపుల కేసులో పోలీసులు మరో నిందితుడిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. అతను ఓ యువ నటుడి నివాసంలో ఆశ్రయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొచ్చి: మలయాళీ నటిపై జరిగిన లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు అధికారులు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొచ్చిలో గల కక్కనాడ్‌లోని ఓ ఫ్లాట్‌లో ఆశ్రయం పొందని అతనని పోలీసులు అరెస్టు చేశారు.

కదులుతున్న కారులో నటిపై లైంగిక వేధింపులకు పాల్పడినవారిలో అతను ఒక్కడని సమాచారం. అతను తలదాచుకున్న ఫ్లాట్ సినీ పరిశ్రమకు చెందిన ఓ నటుడిదని తేలింది. అతను దర్శకుడు కూడా. అతనికి ఆశ్రయం కల్పించినందుకు ఆ యువనటుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Sexual attack on actress: Accused takes shelter in actor's place

అయితే, తాము అదుపులోకి తీసుకున్న నిందితుడి గురించి పోలీసులు ఏ విధమైన సమాచారం కూడా ఇవ్వడం లేదు. కాగా, ఈ కేసుతో మాలీవుడ్‌ు సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తం కావడం తీవ్ర సంచలనాన్ని కలిగిస్తోంది. నటి ప్రయాణ వివరాలను నిందితులకు ఫిలిం యూనిట్ సభ్యుడే చేరవేశాడని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సుని అలియాస్ సునీల్ కుమార్‌కు మలయాళ చిత్ర పరిశ్రమతో సంబంధాలున్నాయి. అతను చిత్రపరిశ్రమకు చెందిన పెద్దలకు అశ్లీల సమాచారాన్ని చేరవేస్తుంటాడని అంటున్నారు. ప్రస్తుతం బాధిత నటి చేస్తున్న సినిమాకు సంబంధించిన యూనిట్ సభ్యులు నలుగురిపై పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+