నెయిల్‌పాలిష్ బాలేదన్నాడు, వేళ్లు తాకాడు: ఆ టెక్కీకి 60నెలలపాటు రూ.50వేలు చెల్లించే శిక్ష!
మహిళా ఉద్యోగిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇన్ఫ్యూజన్ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ భరత్ చంద్రశేఖర్‌కు భారీ శిక్షపడింది.
బెంగళూరు: అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే అబ్బాయిలకు ఈ శిక్ష కనువిప్పు కలిగించేలా ఉంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే అబ్బాయిలు మాత్రం అమ్మాయిల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని తేల్చింది. ఈ విషయం నెయిల్ పాలిష్ రంగు బాగులేదన్న ఇన్ఫ్యూజన్ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ భరత్ చంద్రశేఖర్‌కు అర్థమైంది. ఈ వార్త పూర్తిగా చదవితే మీకు కూడా అర్థమవుతుంది.
వివరాల్లోకి వెళితే.. మహదేవపురలోని ఇన్ఫ్యూజన్ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఉద్యోగిని ఆ కంపెనీలోని ఫిర్యాదుల విభాగానికి ఓ ఫిర్యాదు చేశారు. తాను కంపెనీలో పని చేసిన సమయంలో కంపెనీ సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ భరత్ చంద్రశేఖర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు.

తన నెయిల్ పాలిష్ రంగు గురించి భరత్ చంద్రశేఖర్ కామెంట్ చేసినట్లు పేర్కొన్నారు. అంతేగాకుండా తన వేళ్ళను అనుచితంగా తాకేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. ఈ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో కార్మిక శాఖకు అప్పీలు చేశారు బాధితురాలు. దీంతో డిసెంబర్ 27న కార్మిక శాఖ అదనపు కమిషనర్ టీ. శ్రీనివాస్.. నిందితుడికి భారీ శిక్ష వేశారు.
కార్మిక శాఖ ఇచ్చిన ఆదేశాల్లో 2017 జనవరి 1 నుంచి మూడేళ్ళ పాటు భరత్ చంద్రశేఖర్‌కు జీతం పెంచవద్దని, ఇతర ఆర్థిక ప్రయోజనాలను కూడా అందజేయవద్దని పేర్కొంది. అతని నెల జీతం నుంచి రూ.50 వేలు చొప్పున 60 నెలలపాటు తగ్గించి, ఆ సొమ్మును ఫిర్యాదుదారుకు చెల్లించాలని ఆదేశించింది.
అంతేగాక, ఒకవేళ చంద్రశేఖర్ ఈ కంపెనీలో ఉద్యోగం మానేస్తే, అతనికి చెల్లించవలసిన సొమ్ము నుంచి ఈ సొమ్మును తగ్గించి, ఫిర్యాదుదారుకు చెల్లించాలని స్పష్టం చేసింది. అతను పనిచేసే కంపెనీపై కూడా కార్మిక శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
లైంగిక వేధింపులకు అవకాశం ఉన్న వాతావరణాన్ని సృష్టించారంటూ మండిపడింది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం 2015 సెప్టెంబరు నుంచి 2016 డిసెంబరు వరకు జీతం రూ.4,80,000 ఫిర్యాదుదారుకు చెల్లించాలని ఆదేశించింది. కాగా, ఆమె 2015లో ఆ కంపెనీ ఉద్యోగం మానేశారు. అప్పుడు ఆమె నెల జీతం రూ.30 వేలుగా ఉంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications