అశ్లీల చిత్రాలు చూపించాడు, లైంగికంగా వేధించాడు

ఎనిమిదో తరగతి చదువుతున్న బాధితురాలు 75 శాతం కాలిన దేహంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శుక్రవారంనాడు అమ్మాయి ఇంటిలో సూసైడ్ నోట్ దొరికింది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాన్ని ఆమె అందులో వివరించింది.
మంగళవారంనాడు ఆమె ఇంటిలో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. బయటకు పరిగెత్తుకొచ్చింది. దాంతో ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పి ఆమెను ఆస్పత్రికి తరలించారు.
భార్యాపిల్లలు వారి పుట్టింటికి వెళ్లడంతో గుగారే ఒంటరిగా ఉంటున్నాడు. గుగారే నేరాన్ని అంగీకరించాడు. అమ్మాయికి 50 రూపాయలు ఇచ్చి తన ఇంటికి తీసుకుని వెళ్లానని, బలవంతంగా పోర్న్ చూపించానని, లైంగిక దాడికి ప్రయత్నించానని చెప్పాడు.












Click it and Unblock the Notifications