అన్న రూప రాక్షసుడు .. సొంత చెల్లిపైనే లైంగికదాడి ..
శ్రీ గంగా నగర్ : మానవత్వం మంట కలుస్తోంది. కలియుగంలో వావి వరుసలు మరచిపోతున్నారు కొందరు. రక్త బంధం అని కూడా చూడకుండా లైంగికదాడికి తెగబడుతున్నారు. రాజస్థాన్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కానీ ఆ కుటుంబం లైంగికదాడి గురించి పోలీసులకు చెప్పకుండా గమ్మున ఉండిపోయింది. కానీ బాధితురాలు ఏకంగా అడిషనల్ పోలీసు కమిషనర్‌కి కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అన్న రూప రాక్షసుడు ..
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో తారా రాం కుటుంబం నివసిస్తోంది. అతని భార్య ఉంది. తనతోపాటు తండ్రి, చెల్లెలు కూడా ఉంటున్నారు. చెల్లెలును కూతురిలా చూసుకోవాల్సిన తారా రాం .. వక్రదృష్టి పడింది. తన చెల్లెలుపై లైంగికదాడి చేశాడు తారా రాం. వద్దని చెప్పిన వినకుండా మృగంలా విరుచుకుపడ్డాడు. జరిగిన దురాగతం చూసి ఆ యువతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. అయితే కుటుంబసభ్యులు కాపాడారు. జిల్లా ఆస్పత్రిలో చేర్చగా .. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం బికనిర్ దవాఖానకు తరలించారు. కొద్దిరోజులు చికిత్స పొంది ఇంటికొచ్చింది ఆ యువతి.

ఏసీపీని ఆశ్రయించిన బాధితురాలు
తాను ఇంటికొచ్చాక గానీ తెలియలేదు. లైంగికదాడి చేసిన సోదరునిపై కేసు నమోదు చేయలేదని .. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం అడిషనల్ పోలీసు కమిషనర్‌ను కలిసి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే చర్యలు తీసుకోవాలని ఏసీపీ ఆదేశించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు అతని భార్య, తండ్రి రాజారంపై కూడా కిడ్నాప్, లైంగిక వేధింపులు కేసు నమోదు చేసినట్టు లాల్ గఢ్ పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications