Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Alone lady: భర్త లేడని ఒంటరిగా ఉన్న భార్యను ?, టార్చర్ పెట్టి, ముగ్గురు చేసిన పనికి, మొబైల్ ఫోన్ !

చెన్నై/ తంజావూర్: ఉద్యోగరీత్యా భర్త విదేశాల్లో ఉండటంతో అతని భార్య మాత్రమే ఒంటరిగా నివాసం ఉంటోంది. భర్త దూరంగా ఉండటంతో ఒంటరిగా ఉంటున్న మహిళ మీద కొందరు కామాంధులు కన్ను వేశారు. మహిళను ఏమి చేసినా మమ్మల్ని అడిగే దిక్కేలేదని తెలుసుకున్న కామాంధులు రెచ్చిపోయి ఆమెను టార్చర్ పెట్టారు. రానురాను కామాంధుల ఆగడాలు మితిమీరిపోయి ఆమెను శారీరకంగా లైంగిక వేధింపులకు గురి చేసి మానసికంగా హింసించారు. కామాంధుల టార్చర్ తట్టుకోలేని వివాహిత మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిందితులను అరెస్టు చేసేవరకు మహిళ శవం తీసుకోకుండా మూడు రోజులు ఆందోళన చేసిన బాధితురాలి బంధువులు చివరికి కామాంధులు అరెస్టు కావడంతో శవాన్ని తీసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. ఒంటరి మహిళను కామాంధులు లైంగిక వేధింపులకు గురి చేసి ఆమె ఆత్మహత్యకు కారణం కావడం కలకలం రేపింది.

మూడు సంవత్సరాల క్రితం !

మూడు సంవత్సరాల క్రితం !

తమిళనాడులోని తంజావూర్ జిల్లాలోని పట్టుకోటై సమీపంలోని పెరియనాయకిపురం గ్రామంలో నివాసం ఉంటున్న బాలమురుగన్ (32) అనే యువకుడికి పట్టుకోటై సమీపంలోని తిట్టకూడి గ్రామానికి చెందిన దురై కుమార్తె తమిళజాకికి మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగి మూడు సంవత్సరాల అయినా బాలమురుగన్, తమిళజాకి సంతానం కలగలేదు.

 ఉద్యోగానికి వెళ్లిన భర్త..... ఒంటరిగా ఇంట్లో భార్య

ఉద్యోగానికి వెళ్లిన భర్త..... ఒంటరిగా ఇంట్లో భార్య

ఉద్యోగం చెయ్యడానికి బాలమురుగన్ విదేశాలకు వెళ్లాడు. భర్త బాలమరుగన్ ఉద్యోగం చెయ్యడానికి విదేశాలకు వెళ్లడంతో తమిళజాకి తిరుచిరాపల్లిలో అద్దె ఇంటిలో ఒంటరిగా నివాసం ఉంటోంది. భర్త బాలమురుగన్ లేడని తెలుసుకున్న స్థానిక యువకులు ఇంట్లో ఒంటరిగా ఉంటున్న తమిళజాకిని లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు.

భార్యను ట్రై చేసి టార్చర్ పెట్టారు

భార్యను ట్రై చేసి టార్చర్ పెట్టారు


భర్త లేకుండా ఒంటరిగా ఉంటున్న తమిళజాకిని లొంగదీసుకుని ఎంజాయ్ చెయ్యాలని స్థానికంగా నివాసం ఉంటున్న కామాంధులు, కొందరు అల్లరిమూకలు తమిళజాకిని లైంగిక వేధింపులకు గురి చేశారు. తాను ఒంటరిగా ఉంటున్నానని, ఏదైనా జరగరానిది జరిగితే లేనిపోని సమస్యలు వస్తాయని భయపడిన తమిళజాకి ఆమె భర్త బాలమురుగన్ తో పాటు బంధువులకు కూడా విషయం చెప్పకుండా చిత్రహింసలు భరిస్తూ వచ్చిందని సమాచారం.

ఆత్మహత్యతో కలకలం రేపింది

ఆత్మహత్యతో కలకలం రేపింది

కామాంధుల టార్చర్ ఎక్కువ కావడంతో తమిళజాకి ఆందోళన చెందింది. ఇదే సమయంలో మణికందన్, విగ్నేష్ తో పాటు ఓ మైనర్ బాలుడు తమిళజాకిని లైంగిక వేధింపులకు గురి చేసి కామం తీర్చుకున్నారని సమాచారం. ముగ్గురు కామాంధుల లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతో టార్చర్ తట్టుకోలేని తమిళజాకి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

డెత్ నోట్, మొబైల్ లో సమాచారం

డెత్ నోట్, మొబైల్ లో సమాచారం


తమిళజాకి ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె డెత్ నోట్ రాసిపెట్టడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. తమిళజాకి డెత్ నోట్ తో పాటు ఆమె మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న తిరుచిరాపల్లి పోలీసులు అందులోని వివరాలు ఆమె బంధువులకు, మీడియాకు చెప్పడానికి నిరాకరించారు. తమిళజాకి ఆత్మహత్యకు కారణం అయిన నిందితులను అరెస్టు చేసే వరకు ఆమె శవం తీసుకోమని, అంత్యక్రియలు నిర్వహించమని బాధితురాలి బంధువులు ఆందోళన చేశారు.

Recommended Video

    Why Ashada Masam Considered Inauspicious ? | Oneindia Telugu
    రెచ్చిపోయిన కామాంధులు

    రెచ్చిపోయిన కామాంధులు

    మూడురోజుల పాటు తమిళజాకి మృతదేహం పెరపురాణి ఆసుపత్రిలోనే ఉండిపోవడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. చివరికి తమిళజాకిని లైంగిక వేధింపులకు గురి చేసిన పోలీసులు మణికందన్, విగ్నేష్ తోపాటు మైనర్ ను అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చెయ్యడంతో తమిళజాకి మృతదేహం తీసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. కామాంధులు టార్చర్ పెట్టడంతో వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకోవడం తంజావూర్ లో కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+