Sexval torcher: భార్యకు కూతుర్లకు తేడాలేదు, ముగ్గురు కలిసి మృగాన్ని పక్కాస్కెచ్ తో లేపేశారు!
నోయిడా/ న్యూఢిల్లీ: మద్యం, గంజాయి సేవిస్తూ కామంతో రగిలిపోతున్న మానవమృగం ముగ్గురు కన్న కుమార్తెలను లైంగిక వేధింపులకు గురి చేశాడు. తండ్రి లైంగిక వేధింపుల దెబ్బకు తట్టుకోలేని చిన్న కుమార్తె ప్రాణాలు పోయాయి. భర్త బతికుంటే తన కుమార్తెల జీవితాంతం లైంగిక వేధింపులు తప్పవని భార్య భయపడింది. ఇద్దరు కుమార్తెలతో కలిసి కామాంధుడైన భర్తను చంపేసిన భార్య నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. గతంలో లెక్కలేనన్నిసార్లు తన భర్త మీద ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, అందుకే తన కుమార్తె చనిపోయిందని తల్లి ఆరోపిస్తున్నది.

స్వీపర్ ఉద్యోగం
నోయిడాలోని మరోనా శివార్లలోని మురికివాడల్లో అనీల్ కుమార్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతని భార్య పీకాదేవి. అనీల్ కుమార్, పీకాదేవి దంపతులకు 11 ఏళ్లు, 14 ఏళ్లు, 16 ఏళ్ల వయసు ఉన్న ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. స్వీపర్ ఉద్యోగం చేస్తున్న అనీల్ కుమార్ భార్య పిల్లలను పట్టించుకోకుండా అతను ఎంజాయ్ చేస్తున్నాడు.

గంజాయి, లిక్కర్ బానిస
అనీల్ కుమార్ ఉదయం నిద్రలేచిప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫుల్ గా మద్యం తాగడం, గంజాయి సేవించడం చేస్తున్నాడు. అనీల్ కుమార్ 24 గంటలు మత్తుకు బానిస అయ్యాడు. మద్యం మత్తులో ఇంటికి వెళ్లి విచ్చలవిడిగా భార్య దేవి, ముగ్గురు కుమార్తెలను లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. భార్య ఎవరు, కుమార్తెలు ఎవరు అనే విషయం అనీల్ కుమార్ మరిచిపోయాడు.

కుమార్తెను చంపేసిన కామాంధుడు
మద్యం మత్తులో రోజూ ఇంటికి వెలుతున్న అనీల్ కుమార్ మైనర్లు అయిన కుమార్తెలను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని అతని భార్య దేవి ఇంతకాలం చూస్తూ ఓపిగ్గా సహిస్తూ వస్తోంది. 11 ఏళ్ల కుమార్తెపై అనీల్ కుమార్ పదేపదే అత్యాచారం చెయ్యడంతో ఆమె అనారోగ్యానికి గురై ఇటీవల మరణించిందని తెలిసింది.

చంపేయాలని డిసైడ్
కుమార్తెను లైంగిక వేధింపులతో చంపేసిన అనీల్ కుమార్ వలన మరో ఇద్దరు కుమార్తెల ప్రాణాలకు ముప్పు ఉందని భార్య దేవి భయపడింది. ఎలాగైనా భర్తను చంపేయాలని పీకాదేవి డిసైడ్ అయ్యింది. ఈ విషయం ఇద్దరు కుమార్తెలకు చెప్పడంతో వారు సరే అన్నారు. రాత్రి ఫుల్ గా మద్యం సేవించి ఇంటికి వచ్చిన అనీల్ కుమార్ ఎప్పటిలాగే ఇద్దరు కుమార్తెల మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో భార్య దేవి అనీల్ కుమార్ కాళ్లు గట్టిగా పట్టుకుంది. రెండో కుమార్తె తండ్రి చేతులు గట్టిగా పట్టుకోవడంతో పెద్ద కుమార్తె పంజాబీ డ్రెస్ వేల్ తీసుకుని తండ్రి గొంతు బిగించింది. మద్యం మత్తులో ఉన్న అనీల్ కుమార్ ఊపిరిఆడక వారి నుంచి తప్పించుకోలేక ప్రాణాలు వదిలేశాడు.

పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు
భర్తను హత్య చేసిన పీకాదేవి నేరుగా వెళ్లి భగత్ సింగ్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. తన భర్త ప్రతిరోజు కుమార్తెలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని చాలాసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని పీకాదేవి ఆరోపించింది. అనీల్ కుమార్ ను చాలాసార్లు విచారణ చెయ్యడానికి ప్రయత్నించామని, అయితే అతను ఎప్పుడూ మద్యం మత్తులో ఉండటంతో పోలీసులకు సాధ్యం కాలేదని నోయిడా డీసీపీ రాజేష్ అన్నారు. పీకాదేవిని అరెస్టు చేసి ఆమె ఇద్దరు కుమార్తెలను జువైనల్ కోర్టు ముందు హాజరుపరిచి విచారణ చేస్తున్నామని డీసీపీ రాజేష్ మీడియాకు చెప్పారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications