నటి షబానా అజ్మీకి రోడ్డు ప్రమాదం.. భర్త జావెద్ అక్తర్ సేఫ్.. నుజ్జునుజ్జయిన కారు..

బాలీవుడ్ నటి షబానా అజ్మీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మహారాష్ట్ర రాయగడ్ జిల్లాలోని ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొట్టింది. శనివారం మధ్యాహ్నం 3.30గంటలకు ముంబైకి 60కి.మీ దూరంలోని ఖాలాపూర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో షబానా అజ్మీతో పాటు కారు డ్రైవర్,మరో గుర్తు తెలియని మహిళ గాయపడ్డారు. గాయపడ్డ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమాచారం తెలియగానే స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

గాయపడిన ఇద్దరిని నేవీ ముంబైలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో కారులో షబానా అజ్మీ భర్త,దిగ్గజ గేయ రచయిత జావెద్ అక్తర్ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే ఆయన సురక్షితంగానే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కారును వెనక నుంచి ట్రక్కు వేగంగా ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలిపారు. ప్రమాద తీవ్రతకు షబానా అజ్మీ కారు ముందు భాగం నుజ్జునుజ్జయిపోయింది.

 Shabana Azmi, Driver Injured as Car Rams Into Truck on Mumbai-Pune Expressway, Both Rushed to Hospital

ప్రమాద ఘటన గురించి తెలిశాక ఫిలిం మేకర్ హన్సల్ మెహ్తా సోషల్ మీడియాలో స్పందించారు. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ రహదారిని పోలీసులు పర్యవేక్షిస్తుండాలని కోరారు. రాష్ డ్రైవింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు.. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవన్నారు. దాంతో ఈ రహదారిపై చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్ాయని చెప్పారు. షబానా అజ్మీ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నట్టు చెప్పారు. షబానా యాక్సిడెంట్‌పై మరో నటి స్వర భాస్కర్ కూడా ట్వీట్ చేశారు.

'

కాగా,శుక్రవారం తన భర్త,దిగ్గజ గేయ రచయిత జావెద్ అక్తర్ 75వ జన్మదినాన్ని షబానా ఘనంగా నిర్వహించారు. వీరిద్దరు బర్త్ డే పార్టీల్లో పాల్గొన్న ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+